Breaking News

ప్రజాదర్బార్ కు విన్నపాలు వెల్లువెత్తాయి

-అల్లూరు పార్టీ కార్యాలయంలో వినతిపత్రాలు స్వీకరణ
-తంగిరాల సౌమ్య చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి అనూహ్య స్పందన
-సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ – ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

వీరులపాడు మండలం, అల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మంగళవారం వీరులపాడు మండలం అల్లూరు పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ప్రతి ఒక్కరి నుంచి సౌమ్య వినతులు స్వీకరించారు. వారి సమస్యలు ఓప్పిగా విన్న ఆమె వాటిని పరిష్కరిచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *