Breaking News

పల్లె పండుగ తో ప్రగతి పరుగులు

-ఊరూరా.. వేడుకగా పల్లె పండుగ
-గ్రామాలను అబివృద్ధి బాట పట్టించడానికే పల్లె పండుగ
-ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

వీరులపాడు (మం) (జుజ్జూరు/అల్లూరు), నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం తలపెట్టిన పల్లెపండుగ కార్యక్రమం గ్రామగ్రామాన వేడుకగా జరిగింది. వీరులపాడు మండలంలోని జుజ్జూరు, అల్లూరు గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులతో కలసి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ కింద పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేపట్టారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామీణా ప్రాంతాల్లో ప్రగతి పరుగులు తీస్తుందని అన్నారు. పల్లెపండుగ కార్యక్రమంతో గ్రామాల్లో అభివృద్ధి పనులకు కూటమిప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.4500 కోట్లను అభివృద్ధి పనులకు కేటాయించిందన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవనకల్యాణ్‌ గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలో సుమారు 20కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఒక్కో మండలానికి ఐదుకోట్ల మేర నిధులు మంజూరైనట్లు వివరించారు. జుజ్జురూ గ్రామంలో సుమారు 70లక్షలు, అల్లూరులో రూ. 40 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేసినట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *