రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత జిల్లా కోర్టు ఆవరణలో అండర్ ట్రయిల్ ముద్దాయిల కమిటీ మీటింగ్, ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ మరియు హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ కేసుల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో విచారణలో ఉన్న ముద్దాయిల కేసుల దర్యాప్తు, చార్జ్ షీట్ ఫైల్ చేసే విషయంలో పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. బెయిలు/జామీనుల విషయంలో ఖైదీలు ఎదుర్కుంటున్న సమస్యలపై తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించి, సంబంధిత న్యాయస్థానాలకు తగిన సిఫార్సులు చేశారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ బాడి మీటింగ్ లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యక్రమాలను బాధితుల పరిహారమునకు సంబంధిత అంశాల ను ఆమోధించడం జరిగినది హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ కేసుల్లో బాధితులకు పరిహారం అందించే విషయంలో గౌరవ సుప్రీం కోర్టు వారి ఆదేశాలను అనుసరించాలని అన్నారు. డిశంబరు 14 న జరగబోవు జాతీయ లోక్ అదాలత్ నందు పరిష్కార యోగ్యమున్న వీలైనన్ని ఎక్కువ కేసుల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని తెలియచేసారు.
ఈ సమావేశంలో ఒకటవ అధనపు జిల్లా న్యాయమూర్తి ఆర్. శివ కుమార్ , ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి ఎమ్ అనురాధ , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. ప్రకాష్ బాబు , తూర్పు గోదావరి జిల్లా ఎస్. పి డి. ఎన్ . కిశోర్ , జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాములు , కాకినాడ అడిషనల్ ఎస్.పి ఎమ్. జె. వి. భాస్కర్ రావు , కోనసీమ జిల్లా అడిషనల్ ఎస్.పి ఏ. వి. ఆర్. పి బి ప్రసాద్ , రాజమహేంద్రవరం గవర్నమెంట్ ప్లీడర్ సి.హెచ్ . ప్రసాద్ , కొత్తపేట ఆర్ . డి ఓ అమలాపురం ఆర్. డి. ఓ., సెంట్రల్ జైలు, మహిళ జైలు , జిల్లా సబ్ జైలు అధికారులు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు, పంచాయతి అదికారులు, ట్రాఫిక్ పోలీసు అధికారులు, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.