ఎమ్ బుక్ నిర్వహణా తీరుపై కలెక్టర్ ఆగ్రహం

-వారం రోజుల్లో నివేదిక అందచేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మన బడి మన భవిష్యత్తు కింద జిల్లాలో 655 పనులకి చెంది పాఠశాలలో, కళాశాలల్లో రెండో దశలో చేపట్టిన పనుల రికార్డులు నిర్వహణ విషయంలో ఇంజనీరింగ్ సహాయకుల నిర్లక్ష్య వైఖరి ని ఉపేక్షించటం జరగదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. స్ధానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం నాలుగు ఇంజనీరింగ్ ఏజెన్సీస్ ఆధ్వర్యంలో చేపట్టిన ” మన బడి మన భవిష్యత్తు ” స్కూల్స్ తరగతి గదుల నిర్మాణం, అభివృద్ది, మౌలిక వసతులు కల్పించడం కోసం ఖర్చుల రికార్డుల ఆడిటింగ్ పై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో మన బడి మన భవిష్యత్తు కింద పాఠశాలల్లో పలు అభివృద్ధి పనులు, మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. సదరు పనులకి సంబంధించి సుమారు రూ.200 కోట్ల పనులను నాలుగు ఇంజనీరింగ్ విభాగాలు పంచాయతీ రాజ్, ఆర్ డబ్ల్యూ ఎస్, సర్వ శిక్షా అభియాన్, మునిసిపల్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టడం జరిగిందన్నారు. జిల్లా సర్వ శిక్షా అభియాన్ అధికారి ఎస్ సుభాషిణి, సహాయ ఇంజనీర్లు, ఇంజనీరింగ్ సహాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *