విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ఉచిత ఇసుకను సరఫరా చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా అధికారులను ఆదేశించారు.
ఉచిత ఇసుక విధానంలో భాగంగా కంచికచర్ల మండలం పెండ్యాల 1,2 రీచ్‌ల పరిధిలోని నందిగామ మండలం కంచెల గ్రామంలోని ఇసుక స్టాక్ యార్డ్, వత్సవాయి మండలం శనగపాడు, ఇందుపల్లి స్టాక్ యార్డ్‌లను బుధవారం జాయింట్ కలెక్టర్ నిధి మీనా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా 15 రీచ్‌లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని దీనిలో భాగంగా ముందుగా నేడు నాలుగు రీచ్‌లను ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రస్తుతం నీటి ప్రవాహం ఉన్నందున 11 రీచ్‌లలో ప్రవాహం తగ్గిన వెంటనే ప్రారంభించి ఇసుకను అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన నాలుగు రీచ్‌లలో 3 లక్షల 69 వేల మెట్రిక్ టన్నులతో పాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న మొాగులూరు, కీసర, అనుమంచిపల్లి స్టాక్ యార్డ్‌లతో కలిపి మొత్తం 15 రీచ్‌లకు సంబంధించి 11 లక్షల 6వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. ప్రారంభించిన రీచ్‌లకు సంబంధించి మ్యాపింగ్ నిర్వహిస్తున్నందున రేపటి నుండి అన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో ఇసుకను వినియోగదారులకు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. కొత్తగా ప్రారంభించిన రీచ్‌లలో జిల్లా ఇసుక స్థాయి కమిటీ టన్ను ఇసుక 232 రూపాయల ధరను నిర్ణయించడం జరిగిందన్నారు. ఉచిత ఇసుక విధానంలో మరింత పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పాటించడంతో పాటు ఇసుక సరఫరా పై నిరంతర నిఘా ఉంచాలన్నారు. స్టాక్ యార్డ్‌లలో ఇసుక సరఫరా, నిల్వలకు సంబంధించిన నివేదికలు ఎప్పటికప్పుడు ప్రదర్శించడంతో పాటు అన్‌లైన్‌లో ఉంచాలని జాయింట్ కలెక్టర్ నిధి మీనా అన్నారు.
కార్యక్రమంలో గనులు భూగర్భ శాఖ సహయ సంచాలకులు వీరాస్వామి, నందిగామ ఆర్‌డివో బాలకృష్ణ ఉన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …