-నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 22,23 తేదీలలో విజయవాడ పున్నమి ఘాట్, బబ్బురి గ్రౌండ్స్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమరావతి డ్రోన్ సమ్మిట్ -2024 కార్యక్రమం నిర్వహించుచున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22వ తేదీ సాయంత్రం కృష్ణమ్మ ఒడ్డున డ్రోన్‌షోతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పున్నమిఘాట్, బబ్బురి గ్రౌండ్స్, భవానిఘాట్ పరిసర ప్రాంతాలను ఈ రోజు పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఇతర అధికారులతో కలిసి పున్నమిఘాట్ పరిసర ప్రాంతాలను పరిశీలించి వీఐపీ గ్యాలరీ, పబ్లిక్ గ్యాలరీ.. ఇలా వివిధ గ్యాలరీల వద్ద ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరుగకుండా తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లపై మరియు డెలిగేట్స్, వి. వి. ఐ. పి. లు, సామాన్య ప్రజలు కార్యక్రమాన్ని వీక్షించే క్రమంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఏర్పాటు చేయు భద్రతా ఏర్పాట్లపై మరియు వారి వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమన్వయము చేసుకుంటూ పటిష్ట బందోబస్త్ నిర్వహించాలని అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు మరియు సలహాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.తో పాటు , డి.సి.పి.లు ఏ. బి. టి ఎస్ ఉదయారాణి ఐ.పి.ఎస్., కృష్ణమూర్తి నాయుడు, ఏ.డి.సి.పి.లు ఏ.సి.పి.లు, ఇనస్పెక్టర్లు, ఎస్.ఐలు మరియు పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.