Breaking News

పులుగుర్త వస్త్రాలకు మోడీ కుర్తా తరహాలో ప్రాచూర్యం కల్పించాలి

-ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెస్టివల్ లో ఒక స్టాల్ కోసం ప్రతిపాదనలు పంపాలి
-కలక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పులుగుర్త చేనేత వస్త్రాలకు గణనీయమైన ప్రాచుర్యం ఆ కలుగ చేసేందుకు, అందరికీ చేరువ చేసేందుకు తగిన ప్రతిపాదనలతో, సూచనలతో రావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం కలక్టరేట్ సమావేశ మందిరంలో చెనేత, ఇతర అనుబంద శాఖల అధికారులతో , పులుగుర్త, మురమండ సొసైటి సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఇప్పటికే పులగుర్తి చేనేత వస్త్ర సొసైటి కి తనదైన ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఆ చేనేత వస్త్రాలకు మరింత గుర్తింపు కలుగ చేసేందుకు, విలువ ఆధారిత గుర్తింపు తీసుకుని రావాల్సి ఉందన్నారు. దేశ ప్రధాని మోడీ ధరించే ఖుర్తా కు ఒక ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్న దృష్ట్యా, ఆ తరహా వస్త్ర ధారణ విధానము ను పులుగుర్త చేనేత వస్త్ర పరిశ్రమ కు అనుగుణంగా విలువ ఆధారిత గుర్తింపు తీసుకుని రావాల్సి ఉందని పేర్కొన్నారు. పాలిటెక్నిక్ ఇతర కళాశాల విద్యార్థినీ విద్యార్థులతో పులుగుర్త వస్త్రాల తో ఒక ఫ్యాషన్ ప్రదర్శన ఏర్పాటు చేయాలన్నారు. నేడు యువత కుర్తా పైజామా, మహిళలు పంజాబీ డ్రెస్, ఇతర ఆకట్టుకునే వస్త్ర ధారణ కు ఆసక్తీ చూపుతున్న దృష్ట్యా, పులగుర్తి చేనేత బట్టలు ఆమేరకు డిజైన్ చేయించి మార్కేట్ లోకి అందుబాటులోకి తీసుకుని రావాలన్నారు. కొత్తదనానికి ఎప్పుడూ యువత ప్రాధాన్యతా ఇస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. నవంబర్ 14 నుంచి జాతీయ స్థాయి చేనేత వస్త్ర ప్రదర్శన పులగుర్త చేనేత వస్త్ర స్టాల్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో భాగంగా పులగుర్త వస్త్రాలకు ప్రాచూర్యం కల్పించే దిశలో ఒక బ్రాండ్ అంబాసిడర్ గుర్తించాల్సి ఉందనీ సభ్యులు సూచించారు.

ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చేనేత జౌళి అధికారి / ఇన్చార్జి ఉప సంచాలకులు కే ఎస్ పెద్దిరాజు , పులుగుర్త కార్యదర్శి సత్యనారాయణ రాజు , మురముండ కార్యదర్శి, పోతు రాజు, అభివృద్ధి అధికారి రవికుమార్ పాల్గొన్నారు

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *