Breaking News

గవర్నమెంట్ ఐ టి ఐ (కలెక్టరేట్ వెనుక )లో అక్టోబర్ 19 న వికాస ఆద్వర్యంలో జాబ్ మేళా

-వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కే.లచ్చారావు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 19 వ తేదీ శనివారం ఉదయం “వికాస” ఆధ్వర్యంలో తూర్పు గోదావరీ జిల్లా కలెక్టరేట్ లో “జాబ్ మేళా” నిర్వహిస్తున్నట్లు వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కే.లచ్చారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 19వ తేదీన నిర్వహించే జాబ్ మేళలో శ్రీ రామ్ ఫైనాన్స్ లో మార్కెటింగ్, రికవరీ, సిస్టమ్ ఆపరేటర్స్., ఇండో ఎంఐఎం, పానాసోనిక్, హ్యుండయి కంపెనీలలో టెక్నిషియన్, ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఉద్యోగాలకు ఎస్.ఎస్.సి, ఇంటర్, ఐ.టి.ఐ, డిప్లొమో, & డిగ్రీ, బిటెక్ ఉత్తీర్ణులైన 30 సంవత్సరాల లోపు అభ్యర్థులు అర్హులు. వీరి అర్హత మేరకు నెలకు రూ.10,000/- నుండి రూ. 25,000/ వరకు జీతం మరియు ఇన్సింటివ్స్, భోజనం, వసతి & రవాణా సౌకర్యం ఆయా ఉద్యోగాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులందరూ ఈనెల 31వ తేదీ శనివారం ” కలెక్టరేట్ వెనుక గవర్నమెంట్ ఐ టి ఐ కాలేజ్ (బొమ్మూరు హార్లీక్స్ ఫ్యాక్టరీ ఎదురుగా) రాజమహేంద్రవరం” వద్ద ఉదయం 9.30 గంలకు విద్యా అర్హతల సర్టిఫికెట్స్ జెరాక్స్ ల తో నేరుగా హాజరుకావలెనని తెలిపారు. మరిన్ని వివరాలకు www.vikasajobs.com లేదా ఫోన్ నంబర్ 7660823903 ను సంప్రదించాలని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *