రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
“ఉల్లాస” కార్యక్రమం లో భాగంగా ఆర్ధిక , సామాజిక , విధి నిర్వహణలో, డిజిటల్ అభ్యాసం పై నిరక్షరాస్యత కలిగిన వారిలో అవగాహన పెంపొందించే దిశలో సమాజంలోని అందరికీ జీవితకాల అభ్యాసాన్ని అర్థం చేసుకోవడం పై సెన్సిటివ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం కలక్టరేట్ సమావేశ మందిరంలో వయోజన విద్యా, ఇతర అనుబంద శాఖల అధికారులతో ఉల్లాస్ కార్యక్రమం పై తొలిసారి జిల్లా స్థాయి కమిటీ అధికారులతో వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా విధుల నిర్వహణా లో, ఆర్ధిక, డిజిటల్ అభ్యాసం లో జిల్లాలోని ఆరు మండలాలు పరిథిలో నిరక్షరాస్యత కలిగిన 5,087 మందిని గుర్తించటం జరిగిందన్నారు.
రంగంపేట రాజానగరం బిక్కవోలు చాగల్లు పెరవలి నిడదవోలు మండలాల పరిధిలోనీ వారికి 200 గంటలు శిక్షణ ఇచ్చేందుకు మాస్టర్ ట్రైనర్స్ ద్వారా నవంబర్ 5 నుంచి 2025 మార్చి 15 వరకూ తేదీలను ఖరారు చేసినట్లు తెలిపారు. సంబంధిత నిరక్షరాస్యత కలిగిన వారినీ గుర్తించే బాధ్యత జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి చేపట్టవలసి ఉంటుందని పేర్కొన్నారు. డి ఆర్ డి ఎ, ఐ సి డి ఎస్, గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేసే సిబ్బంది నీ , స్వయం సహాయక సంఘాల మహిళలనీ, వి వో లని కూడా గుర్తించి శిక్షణ కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పది మందికి ఒక ట్రైనర్ అందుబాటులో ఉండేలా జిల్లా విద్యా అధికారి ఉపాధ్యాయుల ఎంపిక , , జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సీఆర్పీలను మాస్టర్ ట్రైనర్ల గా గుర్తింపు చేపట్టాలని పేర్కొన్నారు. మూడు సంవత్సరాలు పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. టాటా గ్రూప్ ఆఫ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమానికి రూప కల్పన చేసినట్లు తెలిపారు. జిల్లా స్థాయి కమిటీ లో కలెక్టర్ , పిడి డిఆర్డి ఏ, జిల్లా పంచాయతి అధికారి, జిల్లా విద్యా అధికారి, జిల్లా పౌర సంబంధాల అధికారి, గ్రామ వార్డు సచివాలయ అధికారి, సభ్యులుగా, జిల్లా వయోజన విద్య అధికారి సమన్వయ కర్త గా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం అమలుకు సమయపాలన నిర్దేసించడం జరిగిందని, జిల్లా కమిటీచే కన్వర్జెన్స్ మీటింగ్ లో కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేయడం జరగాలన్నారు.
జిల్లా వయోజన విద్యా అధికారి పి.. పోశయ్యా నాయుడు వయోజన విద్య తదుపరి సమన్వయ శాఖల ఆద్వర్యంలో 24.10.2024 వరకు సూచించిన ప్రొఫార్మాలో అభ్యాసకులు మరియు గ్రామ శిక్షకులు గుర్తింపు , అనుగుణంగా సర్వే మరియు నమోదు పూర్తి చెయ్యాల్సి ఉంటుందన్నారు. మండల స్థాయి కమిటీలో ఎంపీడీవో ఏపీ డిఆర్డిఏ సిడిపిఓ ఎంఈఓ ఏపీఓ (ఏ ఈ) లు ఉంటారని పేర్కొన్నారు. మాస్టర్ ట్రైనర్స్ కి రాష్ట్ర స్థాయిలో 25.10.2024 నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో గుర్తించిన మండల స్థాయి ట్రైనర్ లకి 29.10.2024 శిక్షణ, అనంతరం మండల స్థాయి శిక్షణ 02.11.2024 నిర్వహించాలని పేర్కొన్నారు. సర్వే లో గుర్తించిన వ్యక్తులకు గ్రామ స్థాయి లో 05.11.2024 నుండి 15.03.2025 వరకు అక్షరాస్యత తరగతులు నిర్వహించాలని తెలియ చేశారు. తదుపరి 200 గంటల శిక్షణా కార్యక్రమాలను నిర్వహించి మార్చి, 2025 మూల్యాంకన పరీక్ష గ్రామ స్థాయిలో నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం విధుల్లో భాగస్వామ్యం అయిన వారికి సమయోచితంతో కూడిన పారితోషకం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో జిల్లా స్థాయి కమిటీ సభ్యులు పి డి ఎ డి ఎ ఎన్విబిఎస్ మూర్తి, ఐ సి డి ఎస్ పి డి కే కృష్ణకుమారి, డీఈవో కే వాసుదేవరావు, డి పి ఆర్ ఓ తరఫున ఎం లక్ష్మణా చార్యులు, డీఎన్డీవో పీ వీణాదేవి, ఇన్చార్జి జిల్లా పంచాయతీ అధికారి ఎమ్. నాగలత లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News