విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పటమట రైతు బజారు సమీపంలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులను శనివారం కలెక్టర్ జె. నివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందన్నారు. క్రీడాకారులకు మరింత సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో స్టేడియంలను అభివృద్ధి చేయడానికి నిధులను కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా గతంలో నిర్మించిన చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం అభివృద్ధికి 8. 91 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు.
ఇండోర్ స్టేడియం వెలుపల ప్రాగణంలో చేపట్టిన జిమ్ సెంటర్, టెన్నీస్, వాలీబాల్ కోర్టులు, వాకింగ్ ట్రాక్ నిర్మాణం పనులు దాదాపు పూర్తి కావచ్చాయన్నారు. గతంలో స్టేడియం లోపలి పై కప్పు రేకులతో కప్పబడి ఉందన్నారు. దానిని తొలగించి ఐరన్ షీట్స్ లతో పై కప్పును నిర్మించి లోపల అదునాతన విద్యుత్ లైటింగ్ తో పాటు ఉడెన్ ఫ్లోరింగ్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పనుల నాణ్యత, మౌలిక సదుపాయల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించి పెండింగ్ లో ఉన్న చిన్నచిన్న పనులను వెంటనే పూర్తి చేసి పున:ప్రారంభించి క్రీడాకారులకు అందుబాటులో తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. స్టేడియం పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్-3 డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యండి కరిముల్లా, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యండి. జాస్మిన్ తదితరులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …