విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 22, 23 తేదీలలో విజయవాడ పున్నమి ఘాట్, బబ్బురి గ్రౌండ్స్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమరావతి డ్రోన్ సమ్మిట్ -2024 కార్యక్రమం నిర్వహించుచున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22వ తేదీ సాయంత్రం కృష్ణమ్మ ఒడ్డున డ్రోన్షోతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్బంగా ఈ రోజు పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఇతర అధికారులతో కలిసి పున్నమిఘాట్, బబ్బురి గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలను పరిశీలించి డెలిగేట్స్, వి. వి. ఐ. పి. లు, సామాన్య ప్రజలు కార్యక్రమాన్ని వీక్షించే క్రమంలో వీఐపీ గ్యాలరీ, పబ్లిక్ గ్యాలరీ.. ఇలా వివిధ గ్యాలరీల వద్ద ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఏర్పాటు చేయు భద్రతా ఏర్పాట్లను మరియు వారి వాహనాల పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు సలహాలు అందించారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయము చేసుకుంటూ పటిష్ట బందోబస్త్ నిర్వహించాలని అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు మరియు సలహాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.తో పాటు , డి.సి.పి. కృష్ణమూర్తి నాయుడు, ఏ.డి.సి.పి.లు ఏ.సి.పి.లు, ఇనస్పెక్టర్లు, ఎస్.ఐలు మరియు పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్
-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …