Breaking News

‘సైలెంట్ కిల్లర్’ పట్ల ప్రజల అప్రమత్తత అత్యవసరం : మంత్రి పేర్ని నాని


మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచంలో మూడొంతుల మంది క్షయ వ్యాధిగ్రస్తులు భారతదేశంలోనే ఉన్నారని, గత 50 ఏళ్లుగా టీబీని నివారించేందుకు ఇండియా పోరాటం చేస్తున్నప్పటికీ అది అదుపులోనికి రాని పరిస్థితి ఉందని అందుకే ఇప్పటికీ దీన్ని ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తున్నారని ఈ వ్యాధి పట్ల ప్రజల అప్రమత్తత అత్యవసరమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) సూచించారు. శనివారం  తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన ముఖాముఖిగా కలుసుకున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. తొలుత స్థానిక గిలకలదిండికి చెందిన పలువురు మంత్రిని కలిసి తల్లితండ్రులను కోల్పోయిన ఇరువురు ఆడపిల్లలకు సహాయం చేయాలనీ అభ్యర్ధించారు. క్షయవ్యాధికి గురైన తన చిన్న పాప ఆరోగ్యం నిమిత్తం లక్ష రూపాయల అప్పు చేసారని ఆ దిగులుతో బాధపడే ఒడుగు ఏసు ఇటీవల ప్రమాదవశాత్తూ మరణించారని ఆయన భార్య వెంకటేశ్వరమ్మ 18 ఏళ్ళ క్రితమే చనిపోయారని వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని ప్రస్తుతం మేనమామ కొక్కిలిగడ్డ మీరా సాహెబ్ ఇంట్లో ఉంటున్నరని తెలిపారు. పెద్దపాప పదవతరగతి చదివిందని, రెండవ పాప ఆరోగ్యం సరిగా లేదని క్షయవ్యాధి లక్షణాలు కనిపించడంతో మందులు వాడుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, పాప టీబి కు మందులు వాడాలని, మంచి ప్రోటీన్ ఉన్న బలమైన ఆహరం ఆ పాపకు అందివ్వాలని తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా క్షయ వ్యాధి నివారణ మందులు ఇస్తుందని అవి వైద్యుల పర్యవేక్షణలో చెప్పిన కోర్స్ ప్రకారం క్రమం తప్పకుండా వాడి ఆ రోగం నయం చేసుకోవాలని సూచించారు. ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు కోసం తప్పక ఏదైనా సహాయం చేద్దామని అన్నారు. పెద్దపాప 10 వ తరగతితో చదువు ఆపివేయకుండా చదువు కొనసాగించాలని అన్నారు.
మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలోని 32 వ డివిజన్ కు చెందిన పరిమి వేణు మంత్రిని కలిసి తాను బి ఎస్సి ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ కోర్స్ చదివేనని, కృష్ణా యూనివర్సిటీలో ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని అభ్యర్ధించారు.
మచిలీపట్నం మండలం గుండుపాలెం గ్రామానికి చెందిన బాలరాజు కావ్యశ్రీ అనే మహిళ తన తల్లితో మంత్రిని కలిసి తన భర్త ఎం బి ఏ చదివేరని ఉద్యోగం లేదని ఏదైనా అవకాశం ఇప్పించాలని కోరారు.
మచిలీపట్నం నడిబొడ్డుగా పిలిచే కోనేరుసెంటర్లో నివసిస్తున్న తమిళనాడుకు గిరిజన తెగలకు చెందిన నక్కలోళ్ల మహిళలు కొందరు మంత్రిని కలుసుకున్నారు. కొన్నేళ్ల నుంచి తాము కోనేరుసెంటర్ లో రోడ్డుపై అద్దాలు దువ్వెనలు అమ్మే దుకాణాలు పెట్టుకున్నామని, ఇప్పుడు వాటిని తొలగించమని అక్కడ నుంచి ఖాళీ చేయమంటున్నారని దీంతో తాము ఎంతో ఇబ్బంది పడుతున్నామని మంత్రికి చెప్పారు.
స్థానిక శారదానగర్ కు చెందిన ఉల్లి ధనలక్ష్మి మంత్రి వద్ద తన కష్టాన్ని చెప్పుకొంది. ఇతను భర్త చనిపోయారని ఇద్దరు ఆడపిల్లలతో మచిలీపట్నంలో అద్దెకు ఉంటున్నానని, తన భర్త తాలూకా బీమా డబ్బులు అందలేదని వా మొత్తాన్ని వచ్చేలా దయచేసి సహాయం చేయాలని అభ్యర్ధించింది.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *