Breaking News

పెదపారుపూడిలో అధునాతన వసతులతో నిర్మించిన పోలీసుస్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించు కోవడం సంతోషదాయకం…


-నూతన భవన నిర్మాణానికి మెగా ఇంజినీరింగ్ సంస్థ సేవలు సహకారం మరువలేనిది…
 : రాష్ట్ర మంత్రులు పేర్ని వెంకట్రామయ్య(నాని), కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని)
-ప్రజల భద్రతకు పోలీసు యంత్రాంగం అహర్నిషలు కృషి చేస్తుంది…
-మహిళల భద్రత కొరకు ప్రభుత్వం 1500 మంది మహిళా పోలీసులను నియామకం చేస్తుంది…
: ఏలూరు రేంజ్ డిఐజీ మోహనరావు

పెదపారుపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
విధి నిర్వహణలో జిల్లా పోలీసు యంత్రాగం చేస్తున్న సేవలు మరువలేనివని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), రాష్ట్ర పౌరసరఫరాలు శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) అన్నారు.
శనివారం పెదపారు పూడి మండలం పెదపారుపూడి గ్రామంలో రూ. 80 లక్షల వ్యయంతో మెగా ఇంజినీరింగ్ సంస్థ నూతనంగా అధునాతన వసతులతో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు పేర్నినాని, కొడాలి నాని, ముఖ్యఅతిధులుగా పాల్గొని ఏలూరు రేంజ్ డిఐజీ మోహనరావు, జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు, పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ లతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీసు శాఖ ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తారన్నారు. శాంత్రి భద్రల పర్యవేక్షణ, ప్రజలకు రక్షణ కల్పిస్తూ వారి సమస్యలను పరిష్కరించే పోలీసుకు అధునాతన వసతులతో కూడిన నూతన భవాన్ని మెగా ఇంజినీరింగ్ సంస్థ నిర్మించి అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్లకు భవనాలు అవసరమో అక్కడున్న ప్రజా ప్రతినిధుల్ని, అధికారుల్ని సమాయత్తం చేసి భవనాలు నిర్మించేందుకు వారికి పూర్తి సహాయ సహకారాలు జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు అందించే విధంగా కృషి చేశారన్నారు. ఇందులో భాగంగా నేడు పెదపారుపూడిలో నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించుకోవడం సంతోషం దాయకమన్నారు. ఈ పోలీసు స్టేషన్ నూతన భవనాన్ని నిర్మించడంలో స్థానిక శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ ఎంతో కృషి చేసారన్నారు.
సభాకార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ అదునాతన వసతులతో కూడిన ఈ పోలిస్టేషన్ భవన నిర్మాణానికి జిల్లా ఎస్పీ రవీంద్రనాద్ బాబు తో కలసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశామన్నారు. మెగా ఇంజినీరింగ్ సంస్థ అతి తక్కువ కాలంలోనే పోలీసు స్టేషన్ భవనాన్ని నిర్మించినందులకు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. పామర్రు నియోజకవర్గంలో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై ఎటువంటి సమస్యలను ఉత్పన్నమైనా చెప్పిన వెంటనే పరిష్కరిస్తున్న రాష్ట్రమంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలకు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.
ఏలూరు రేంజ్ డిఐజీ కే.వి. మోహనరావు మాట్లాడుతూ ప్రజల భద్రతకు పోలీసు యంత్రాంగం అహర్నిషలు కృషి చేస్తుందన్నారు. మహిళల భద్రత కొరకు రాష్ట్ర ప్రభుత్వం 1500 మంది మహిళా పోలీసులను నియామకం చేస్తుందన్నారు. అతి తక్కువ సమయంలో మెగా ఇంజినీరింగ్ సంస్థ పోలీస్ స్టేషన్ కు మంచి భవనాన్ని నిర్మించడం సంతోషదాయకమన్నారు.
జిల్లా ఎస్పీ రవీంధ్రనాద్ బాబు మాట్లాడుతూ మహిళలకు ప్రత్యేక మహిళా పోలీసుతో పాటు ప్రత్యేక డస్క్ కూడా పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసామన్నారు. ప్రజా రక్షణ, శాంతి భధ్రతల పర్యవేక్షణ లో ప్రజలు పోలీసు సేవలను వినియోగించుకోవాలని ఆయన అన్నారు. ఇంత సుందరంగా అధునాతన వసతులతో అతి తక్కువ సమయంలోనే నిర్మించిన మెగా సంస్థ అధినేత కృష్ణారెడ్డి, వారి సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్బంగా రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నానిని ఎస్పీ రవీంద్రనాద్ బాబు, డీఐజీ మోహన్ రావు దుశ్యాలువాతో మెమోంటోనందించి సత్కరించారు. తదుపరి పోలీసు శాఖ ఉన్నాతాధికారులకు, మెగా సంస్థ ప్రతినిధులకు స్థానిక శాసనసభ్యులు దుశ్యాలువాతో మెమోంటోనందించి సత్కరించారు.
కార్యక్రమంలో పెదపారుపూడి సర్పంచ్ చప్పిడి సమీరా, మార్కెట్ యార్డు చైర్ పర్సన్ దొంతిరెడ్డి కవితా శ్రీరామ్ ఆడిషినల్ ఎస్.పి(పరిపాలన) మల్లికా గార్గ్ , అడిషినల్ ఎస్పీవకుల్ జిందాల్, ఏ.ఆర్.ఏ.డిఎస్పీ సత్యనారాయణ, గుడివాడ, అవనిగడ్డ, బందరు డీఎస్పీలు సత్యానందం, యండి మహబూబ్ భాషా, షేక్ మసుమ్ బాషా, ఎస్సీ, ఎస్టీ డీఎస్పీ మహేష్ పాల్, సీఐ. జి. శ్రీనివాస్,ఎస్.రాజేంద్ర ప్రసాద్, పలువులు సీఐలు, ఎస్.ఐ.లు, మెగా సంస్థ ప్రతినిధి కృష్ణారెడ్డి పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *