-మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడి
-వెలగలేరులో ఘనంగా ‘పల్లెపండుగ’
ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జి.కొండూరు మండలంలోని వివిధ గ్రామాల్లో 10082 మీటర్ల పొడవునా 41 రహదారుల నిర్మాణానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ.5.16 కోట్లు మంజూరు చేసినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. వెలగలేరు గ్రామంలో ఆదివారం నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీసీ రహదారుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. శాసనసభ్యులు కృష్ణప్రసాదు తో పాటు మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ అక్కల రామ్మోహన్రావు (గాంధీ), ఎన్డీఏ మహాకూటమి నాయకులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ… మండల కేంద్రమైన జి.కొండూరు గ్రామంలో 1003 మీటర్ల పొడవునా 5 రహదారుల నిర్మాణానికి రూ.53 లక్షలు, వెల్లటూరులో 940 మీటర్ల పొడవునా 4 రహదారుల నిర్మాణానికి రూ.50 లక్షలు, కవులూరులో 960 మీటర్ల పొడవునా 3 రహదారుల నిర్మాణానికి రూ.44.5 లక్షలు, వెలగలేరులో 875 మీటర్ల పొడవునా 2 రహదారుల నిర్మాణానికి రూ.40 లక్షలు, కోడూరులో 610 మీటర్ల పొడవునా 3 రహదారుల నిర్మాణానికి రూ.29.5 లక్షలు, చెవుటూరులో 515 మీటర్ల పొడవునా 2 రహదారుల నిర్మాణానికి రూ.27.1 లక్షలు, ఆత్కూరులో 595 మీటర్ల పొడవునా 2 రహదారుల నిర్మాణానికి రూ.26.5లక్షలు, గంగినేనిపాలెంలో 472 మీటర్ల పొడవునా 1 రహదారి నిర్మాణానికి రూ.23 లక్షలు, కట్టుబడిపాలెంలో 277 మీటర్ల పొడవునా 2 రహదారుల నిర్మాణానికి రూ.20.5 లక్షలు, గడ్డమణుగులో 425 మీటర్ల పొడవునా 2 రహదారుల నిర్మాణానికి రూ.20 లక్షలు, చెరువు మాధవరంలో 400 మీటర్ల పొడవునా 2 రహదారుల నిర్మాణానికి రూ.20 లక్షలు, కుంటముక్కలలో 400 మీటర్ల పొడవునా 1 రహదారి నిర్మాణానికి రూ.20 లక్షలు, కందులపాడులో 265 మీటర్ల పొడవునా 2 రహదారుల నిర్మాణానికి రూ.19 లక్షలు, గుర్రాజుపాలెంలో 250 మీటర్ల పొడవునా 1 రహదారి నిర్మాణానికి రూ.18.75 లక్షలు, పినపాకలో 415 మీటర్ల పొడవునా 2 రహదారుల నిర్మాణానికి రూ.18.3 లక్షలు, వెంకటాపురంలో 240 మీటర్ల పొడవునా 1 రహదారి నిర్మాణానికి రూ.18 లక్షలు, తెల్లదేవరపాడులో 315 మీటర్ల పొడవునా 1 రహదారి నిర్మాణానికి రూ.15.75 లక్షలు, హావేలి ముత్యాలంపాడులో 350 మీటర్ల పొడవునా 1 రహదారి నిర్మాణానికి రూ.15 లక్షలు, దుగ్గిరాలపాడులో 240 మీటర్ల పొడవునా 1 రహదారి నిర్మాణానికి రూ.12 లక్షలు, చిననందిగామలో 205 మీటర్ల పొడవునా 1 రహదారి నిర్మాణానికి రూ.10.3 లక్షలు, మునగపాడులో 190 మీటర్ల పొడవునా 1 రహదారి నిర్మాణానికి రూ.9.5 లక్షలు, సున్నంపాడులో 140 మీటర్ల పొడవునా 1 రహదారి నిర్మాణానికి రూ.6 లక్షలు నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వస్తున్న సీఎం చంద్రబాబు కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ మహాకూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.