జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
జగ్గయ్యపేట నాగమయ్య బజారులో అధికార పార్టీ ఆగడాలకు బలైన వైసీపీ సానుభూతిపరుడు గుగ్గిళ్ళ శ్రీను కుటుంబాన్ని వైసిపి జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ పరామర్శించి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యాలకు బలైన గుగ్గిళ్ళ శ్రీను కుటుంబానికి వైసీపీ పార్టీ అండగా ఉంటుందన్నారు. శ్రీను మరణాన్ని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఆర్థికంగా రెండు లక్షలు అందజేయాలని ఆదేశించారని అన్నారు. దేశంలో తమ పార్టీ నాయకుల, కార్యకర్తల యొక్క బాగోగులు చూసుకునే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని కొందరు సీనియర్ నాయకులు వీడిన కార్యకర్తలు ఎక్కడ ధైర్యం కోల్పోకుండా అధికార పార్టీ దౌర్జన్యాలను అడ్డుకుంటూ ముందుకు వెళ్ళటం అభినందనీయం. పార్టీలోని ప్రతి నాయకుడికి, జెండా మోసిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి వెంట నిలిచిన ప్రతి నాయకుడు, కార్యకర్త 2029లో వైసీపీ పార్టీ అధికారమై లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరావు, రాష్ట్ర కార్యదర్శి ఇంటురి రాజగోపాల్ (చిన్న), ఎంపీపీలు మార్కాపూడి గాంధీ, రమాదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజ్ ఉన్నీసా, కౌన్సిలర్ వట్టెం మనోహర్, నంబూరి రవి, భద్దునాయక్, చౌదవరపు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags jaggaiahpeta
Check Also
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్
-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …