రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ, ఆర్ధిక సేవల విభాగము వారి ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లాలో గ్రామ స్థాయి జన సురక్ష కార్యక్రమం అక్టోబరు 15 నుంచి 2025 జనవరి15 వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు.
మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ ఛాంబర్ లో గ్రామ స్థాయి జన సురక్ష కార్యక్రమం గోడప్రతిని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి పథకం యొక్క ప్రయోజనాలను తెలియ చేస్తూ, గ్రామ స్థాయి జన సురక్ష కార్యక్రమం కింద రెండు బీమా పథకాలు అన్నీ వర్గాల ప్రజలకి అందుబాటులోనికి తీసుకుని రావడం జరిగిందన్నారు. రాష్ట్ర లీడ్ బ్యాంకు ఆదేశాల మేరకు లీడ్ బ్యాంక్ కార్యాలయం, తూర్పుగోదావరి జిల్లా వారి సహకారంతో కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలు అయిన ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కేవలం రూ.20/-లతో చెల్లింపు తో
రూ .2,00,000/- లు ప్రమాద బీమా , ప్రమాదవశాత్తు సంభవించిన అంగవైకల్యమునకు కూడా బీమా వర్తించును. ఈ పథకం కింద వయస్సు 18-70 సం.ల వరకు బ్యాంక్ ఖాతా కలిగిన అందరూ అర్హులు అని తెలిపారు. ప్రతి సంవత్సరము ఆటో డెబిట్ ద్వారా ప్రీమియం మొత్తము బ్యాంక్ ఖాతా నుండి చెల్లించబడును బీమా సం.ర కాలపరిమితి జూన్ 1వ తారీఖు నుండి మే 31వ తేదీ వరకు ఉంటుందని పేర్కొన్నారు.
అదే విధంగా ప్రథాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కేవలం రూ.436/- ల ప్రీమియం తో రూ.2,00,000/- జీవిత బీమా సౌకర్యం, వయస్సు 18-50 సం.ల వరకు బ్యాంకు ఖాతా కలిగిన అందరూ అర్హులు ప్రతీ సం.ము ఆటో డెబిట్ ద్వారా ప్రీమియం మొత్తం బ్యాంక్ ఖాతా నుండి చెల్లించబడును బీమా సం.ర కాలపరిమితి జూన్ 1వ తారీఖు నుండి మే 31వ తేదీ వరకు వరకు ఉంటుందని పేర్కొన్నారు.
ఈ పోస్టర్ ఆవిష్కరించిన కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ డి వి ప్రసాద్, డి ఆర్ డి ఎ పిడి ఎన్ వి ఎస్ మూర్తి , ఇన్చార్జి డివిపివో ఎమ్. నాగాలత పాల్గొన్నారు.