Breaking News

కనీస వేతనాల చట్టం అమలు అయ్యేలా కార్మిక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో కనీస వేతనాల చట్టం అమలు అయ్యేలా కార్మిక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, తిరుపతి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలలో ఎన్ ఎం ఆర్ / మజ్దూర్ కార్మికుల కనీస వేతనాలు 2024-25 సంవత్సరానికి గాను కమిటీ ఆమోదించిన కనీస వేతనాలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

మంగళవారం రాత్రి జిల్లాలో 2024-25 సంవత్సరానికి గాను కనీస వేతనాల సవరణకు సంబంధించిన కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరుగగా అందులో కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలలో ఎన్ ఎం ఆర్ / మజ్దూర్ కార్మికుల కనీస వేతనాలు అమలు అయ్యేలా అధికారులు నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ స్కిల్డ్ ఎంప్లాయిమెంట్ కింద గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ వేతనం రూ. 538 గా, మున్సిపాలిటీలలో రూ. 621 గా, మునిసిపల్ కార్పొరేషన్ లలో రూ.677 గా వేతనాలుగా, సెమీ స్కిల్డ్ ఎంప్లాయిమెంట్ కింద గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ వేతనం రూ. 565 గా, మున్సిపాలిటీలలో రూ. 652 గా, మునిసిపల్ కార్పొరేషన్ లలో రూ.712 గా వేతనాలుగా, స్కిల్డ్ ఎంప్లాయిమెంట్ కింద గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ వేతనం రూ. 594 గా, మున్సిపాలిటీలలో రూ. 685 గా, మునిసిపల్ కార్పొరేషన్ లలో రూ.749 గా వేతనాలుగా ఏప్రిల్ 1, 2024 నుండి తిరుపతి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలలో ఎన్ ఎం ఆర్ / మజ్దూర్ కార్మికుల కనీస వేతనాలు అమలు అవుతాయని తెలిపారు.

ఈ సమావేశంలో డిప్యూటీ లేబర్ కమిషనర్ ఓంకార్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ చిన్న లాలప్ప, ఆర్డీఓ లు రాంమోహన్, కిరణ్మయి, భాను ప్రకాష్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు- రాష్ట్రంలోనే తొలిసారిగా ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ ప్రారంభం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) కొండ దిగువన, అర్జునవీధి ప్రారంభంలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *