-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా 23వ డివిజన్ సూర్యారావుపేట నందున్న కమలా నెహ్రూ విమెన్స్ హాస్టల్, మహిళా శిశు బాల సంక్షేమ సదరం ను పరిశీలించారు. హాస్టల్ వద్ద ప్రహరీ కూలిపోయింది అని తెలిసిన వెంటనే అధికారులను గోడ పునః నిర్మించడానికి కమిషనర్ ఆదేశాలు ఇవ్వగా, బుధవారం ఉదయం అధికారులతో వారి కార్యాచరణను విమెన్స్ హాస్టల్ వద్ద స్వయంగా తానే పరిశీలించారు. త్వరితగతిన పనులను పూర్తి చేసి ప్రహరీని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మించేటప్పుడు ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి అని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ సిటీ ప్లానర్ జీ వి జీ ఎస్ వి ప్రసాద్, సూపరింటింగ్ ఇంజనీర్ వర్డ్స్ పి సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జీ సామ్రాజ్యం, ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.