-అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు ఆట పాటలతో విద్య, ఆరోగ్యం పర్యవేక్షణ అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఎంతో అవసరం : జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
వెంకటగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు ఆట పాటలతో విద్యా, ఆరోగ్యం పర్యవేక్షణ ఎంతో అవసరం అని, అంగన్వాడి కేంద్ర పరిధిలోని ప్రీ స్కూలింగ్ బాల బాలికలకు, బాలింతల వారి సంక్షేమం సంబంధిత అంగన్వాడీ కార్యకర్తలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులదే అని అప్రమత్తంగా జాగ్రత్తగా వారిని చూసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు.
బుధవారం మధ్యాహ్నం వెంకటగిరి పట్టణం పరిధిలోని చెవిరెడ్డిపల్లి- 2, మల్లమ్మ గుడి వీధి నందు గల అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి పిల్లలందరికీ మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా అని ఆరా తీశారు. అంగన్వాడీ ప్రాజెక్ట్ ఆఫీసర్, అంగన్వాడి కార్యకర్త వివరాలు తెలుపుతూ సదరు కేంద్రంలో 15 మంది పిల్లలు నమోదు అయి ఉన్నారని, సదరు అంగన్వాడీ పరిధిలో 9 మంది బాలింతలు ఉన్నారని పోషకాహారం సంపూర్ణ పోషణ అభియాన్ కింద అందించడం జరుగుతోందని తెలపగా, కలెక్టర్ ఆరా తీస్తూ పిల్లలకు పాలు పౌష్టికాహారాలు గుడ్లు అందిస్తున్నరా అని తనిఖీ చేశారు. కలెక్టర్ పిల్లలను ఆప్యాయంగా పలకరిస్తూ పిల్లలతో abcd లు,సంఖ్యలపై అవగాహన ఉన్న వారు బోర్డు పై రాయమనగా వారు ఎంతో చురుకుగా బోర్డుపై వివరాలను సక్రమంగా రాయగలిగారు. కలెక్టర్ పిల్లలను అభినందించి వారిని మంచిగా ఆరోగ్యంగా ఉన్నతంగా ఎదగాలని ఆశీర్వదించారు. అనంతరం కలెక్టర్ వంటగదిని తనిఖీ చేసారు. పిల్లలకు అంగన్వాడి కేంద్రంలో ఆటసామాగ్రి సక్రమంగా వినియోగించాలని సూచిస్తూ ప్రాంగణంలో ఆడుకునే విధంగా మట్టి తోలించాలని తాసిల్డార్ కు కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి తాసిల్దార్ రాంబాబు, ఎంఈఓ వెంకటేశ్వర్లు, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని శంషాద్, ఎంపీడీవో కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.