Breaking News

పేదలకు ఆకలి తీర్చే ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ పేదలకు ఒక గొప్ప వరం

-నాణ్యమైన ఆహారం అతి తక్కువ ధరకే పేదలకు అందుబాటులో ఉంచి కడుపు నిండా పెడుతున్న ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు :జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
-కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి… ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ లను అమలు చేసిన గొప్ప ముఖ్యమంత్రి మహా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు: ఎమ్మెల్యే కొరుగొండ్ల రామకృష్ణ

వెంకటగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలకు నామ మాత్రపు ధరతో ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతమైన ఆశయానికి అనుగుణంగా ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ లను జిల్లాలోని పలు నియోజక వర్గాలలోని మునిసిపల్ పరిధిలో ప్రారంభించి వారికి కడుపు నిండా నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని, ఈ కార్యక్రమం పేదలకు గొప్ప వరం అని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ మరియు వెంకటగిరి ఎమ్మెల్యే కొరుగొండ్ల రామకృష్ణ సంయుక్తంగా పేర్కొన్నారు.

బుధవారం వెంకటగిరి పట్టణంలో ఎంపిడిఓ కార్యాలయం సమీపంలో రూ. 16.86 లక్షల వ్యయంతో అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ పనులను చేపట్టి పలు వసతులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే సంయుక్తంగా ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్ గారి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం పేదలకు రూ. 5 లకే అందిస్తున్న భోజనం కలెక్టర్ మరియు ఎమ్మెల్యే వడ్డించారు. అనంతరం వారు పేదలతో కలిసి క్యాంటీన్లో భోజనం చేశారు.

కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో వివిధ గ్రామాల నుండి, ప్రాంతాల నుండి పట్టణానికి వచ్చే పేదలకు, భవన నిర్మాణ కార్మికులకు, పట్టణంలోని పేద ప్రజలకు నామ మాత్రపు రూ. 5 ధరకే నాణ్యమైన ఆహారం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమం ఈ ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు అని అన్నారు. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో కలిపి 11 ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకోడం జరిగిందనీ కలెక్టర్ తెలిపారు. మన జిల్లాలో రెండవ దశ కింద ప్రారంభించుకోడం జరిగిందనీ, నేడు వెంకటగిరి నందు ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ను ఎమ్మెల్యే తో కలిసి ప్రారంభించడం ఎంతో సంతోషకరమని అక్షయ పాత్ర ఫౌండేశన్ ద్వారా నాణ్యమైన ఆహారం సదరు అన్నా క్యాంటీన్లో అందించడం జరుగుతోందని అన్నారు. ఇందులో సగటున ప్రతిరోజు మధ్యాహ్నం 450 మంది పేదలు భోజనం చేస్తున్నారని, రాత్రి 350 నుండి 400 మంది సదరు క్యాంటీన్ ద్వారా భోజనం చేస్తున్నారని తెలిపారు, ప్రతిరోజు వివిధ రకాలైన మెనూతో రుచికరమైన ఆహారం ఐదు రూపాయలకే అందించడం జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో కూడా ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారని, ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో పేదలకు కడుపునిండా అన్నం పెట్టి వారి ఆకలిని తీర్చే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లను ప్రారంభించారని పేద ప్రజలకు ఇది ఒక పెద్ద సదవకాశమని అన్నారు. గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను రద్దు చేశారని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తిరిగి అన్నా క్యాంటీన్లను మున్సిపాలిటీలలో ప్రారంభించుకోవడం జరిగిందని, జిల్లా కలెక్టర్ తో కలిసి నేడు వెంకటగిరిలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. పేదలకు ఐదు రూపాయలకే నాణ్యమైన, శుచికరమైన, రుచికరమైన ఆహారం ప్రతి రోజు డిఫరెంట్ మెనూ అందించడం జరుగుతోందని అక్షయపాత్ర ఫౌండేషన్ ఒక సేవ తత్పర ఫౌండేషన్ అని అన్నారు.

అక్కడ పేద ప్రజలు భోజనం చేసి ఆహారం బాగుందని, నాణ్యతగా శుచిగా ఉందని, ప్రభుత్వం నుండి ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు తమకు వరం అని ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేసారు.

ఈ కార్యక్రమంలో వెంకటగిరి మునిసిపల్ కమిషనర్ ఇంఛార్జి శ్రీధర్, ఇంఛార్జి తాసిల్డార్ రాంబాబు, ఎంపిడిఓ కోటేశ్వర రావు తదితర అధికారులు, ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *