Breaking News

నగరంలో రెవెన్యూ వసూళ్లు వేగవంతం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో రెవెన్యూ వసూళ్లు వేగవంతం చేయాలని, ఇటీవల చేపట్టిన సర్వేలో ఆస్తి పన్ను లేకుండా గుర్తించిన వాటికి తదుపరి సమావేశం నాటికి పన్ను విధింపు జరగాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో అదనపు కమిషనర్ తో కలిసి డిప్యూటీ కమిషనర్, రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లతో రెవెన్యూ విభాగ సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ల వారీగా వసూళ్ళ పై సమీక్షించి, పన్ను వసూళ్లలో పురోగతి ఉండాలని, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. తదుపరి సమావేశానికి పాత బకాయిల వసూళ్లు, సర్వేలో గుర్తించిన షుమారు 4 వేల ఆస్తులకు నూతన పన్ను విధింపులో పురోగతి ఉండాలని, వసూళ్లకు రోజువారీ లక్ష్యాన్ని నిర్దేశించాలని అదనపు కమిషనర్ ని ఆదేశించారు. వార్డ్ సచివాలయాల వారీగా కమర్షియల్, రెసిడెన్సీల వారీగా రీ చెక్ చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాల బకాయీలపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, అడ్మిన్ కార్యదర్శులు రోజు పని గంటల్లో సగం సమయం పన్ను వసూళ్లు, మరో సగం సమయం నూతన అసెస్మెంట్లకు పన్ను విధింపుపై కేటాయించుకోవాలన్నారు. సచివాలయం పరిధిలో నూరు శాతం డిమాండ్ నోటీసులు అందించాలని, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో నోటీసుల పంపిణీని క్రాస్ చెక్ చేయాలని ఆదేశించారు. పన్ను వసూళ్లలో నిర్దేశిత లక్ష్యాలు మేరకు పురోగతి లేకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. ఖాళీ స్థల పన్ను విధింపులో అలక్ష్యం ఉండకూడదన్నారు. నీటి పన్ను, మీటర్ చార్జీలు పెండింగ్ పై అసహనం వ్యక్తం చేసి, క్యాష్ కౌంటర్లలో నీటి పన్ను చెల్లించిన తర్వాతనే ఆస్తి పన్నుచెల్లించేలా చర్యలు తీసుకోవాలని, నీటి పన్ను బకాయి చెల్లించని వారికి ట్యాప్ కనెక్షన్ తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సర్వీస్ లు నిర్దేశిత గడువులోగా పరిష్కారం కావాలన్నారు.
సమావేశంలో అదనపు కమిషనర్ సిహెచ్.ఓబులేసు, డిప్యూటీ కమిషనర్ డి.శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారులు రెహమాన్, రవికిరణ్ రెడ్డి, శివన్నారాయణ, సాదిక్ భాష, సూపరిండెంట్ వెంకట రామయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *