-కోనుగోలు చేసిన 48 గంటల్లోగా రైతుల ఖాతాకు సొమ్ము జమ
-మండల పరిధిలో 3 ఎఫ్ టి వో లకు చెందిన రూ .3 లక్షల సొమ్ము జమ
-జెసి ఎస్ .చిన్న రాముడు
కొవ్వూరు , నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలో 2024-25 ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి ధాన్యం కోనుగోలు ప్రక్రియ ప్రారంభం చెయ్యడం జరిగిందని, అందుకు అనుగుణంగా సొమ్మును 48 గంటల్లోగా రైతుల బ్యాంకు ఖాతాలకు నేడు నేరుగా జమ చేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కొవ్వూరు మండలం ధర్మవరం రైతు సేవా కేంద్రం లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం లో అక్టోబరు 21 , 22 తేదీల్లో ఇద్దరూ రైతుల నుంచి ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పండించిన ధాన్యాన్ని సేకరణ చెయ్యడం జరిగిందని తెలిపారు. ఇందు నిమిత్తం రైతు పోలిశెట్టి శేషయ్య నుంచి “గ్రేడ్ – ఏ రకం” అక్టోబరు 21 న 60 మెట్రిక్ టన్నులు , అక్టోబర్ 22 న 32.4 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ చేసినట్లు తెలిపారు. అదే విధంగా అక్టోబర్ 22 వ తేదీన పిన్నేటి రమేష్ నుంచి 37.2 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేసినట్లు పేర్కొన్నారు. ఇందు నిమిత్తం పి. శేషయ్య కు రూ.2,14,368 /- , పి. రమేష్ కు రూ.85,560/- లు బుధవారం సేకరణ కు సంబంధించిన సొమ్ము మొత్తాన్ని జమ చేయడం జరిగిందని తెలిపారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ కు సంబంధించిన సొమ్ము 48 ల్లోగా జమ కావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Prajavartha Online Telugu News