-కోనుగోలు చేసిన 48 గంటల్లోగా రైతు ఖాతాకు జమ
-జెసి చిన్న రాముడు
నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి 2024-25 ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి కోనుగోలు చేసిన ధాన్యం సొమ్మును 48 గంటల్లోగా రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలలోకి వెళితే నల్లజర్ల మండలం ప్రకాశరావు పాలెం రైతు సేవా కేంద్రం లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు అప్పసాని నాగమణి 16.40 మెట్రిక్ టన్నుల కామన్ వెరైటీ రకం ఖరీఫ్ ధాన్యం అక్టోబరు 21 న సేకరణ చెయ్యడం జరిగింది. ఇందు నిమిత్తం రైతుకు చెల్లింపులు చెయ్యవలసిన రు.37,720 /- బుధవారం రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందని జెసి చిన్న రాముడు తెలియ చేశారు. రాష్ర్ట ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ధాన్యం సేకరణ చేసిన 48 గంటల్లో నగదు చెల్లింపు జరపడం పట్ల రైతు నాగమణి హర్షం వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు ఆదేశాల మేరకు బుధవారం స్థానిక ప్రకాశరావు పాలెం రైతూ సేవా కేంద్రాన్ని జిల్లా పౌర సరఫరాల అధికారి జెవిఎస్ ప్రసాద్ సందర్శించి రికార్డులను పరిశీలించడం జరిగింది.
Prajavartha Online Telugu News