-తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి
-ఇకపై రెవిన్యూ అధికారుల సమావేశంలో డివిజన్ స్థాయిలో నిర్వహిస్తాం
-కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఏదైనా ఒక అర్జీ పరిష్కారం కోసం వేచి ఉండే ధోరణితో కాకుండా, సమయానుకూలంగా ప్రవర్తించే తీరును బట్టి అర్జిదారుడు సంతృప్తి స్థాయి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టర్ కార్యాలయ దృశ్య మాధ్యమ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి రెవిన్యూ అధికారుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ , ఏదైనా సమస్య పరిష్కారం కోసం ఆర్డీవో లు , తహసిల్దార్ లు క్షేత్ర స్థాయిలో ఎంతవరకు స్పందించారో అన్న వాటిపై ఆధారపడి ఉంటుందన్నారు. అర్జీ దారునికి అందుబాటులో ఉండడం, క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసే విధానం బట్టే ఉంటుందన్నారు. మండల స్థాయిలో పరిష్కారం అయ్యే సమస్యలు జిల్లా కలెక్టర్ కి రావడం పై కలెక్టర్ ప్రశ్నించారు. ఇకపై టూర్ డైరీ సమర్పించే క్రమములో క్షేత్ర స్థాయిలో ఎన్ని పిజిఆర్ఎస్ అర్జీలను పరిశీలన చేసినట్లు నివేదిక లో పొందుపరచాలని పేర్కొన్నారు. ఇకపై రెవిన్యూ అధికారుల సమావేశంలో డివిజన్ స్థాయిలో నిర్వహిస్తామని తెలిపారు
రికార్డు ఆఫ్ రైట్ కు అనుగుణంగా ఒక రెవిన్యూ అధికారి ఒక అర్జీని తిరస్కారం చేసిన తరువాత తిరిగి అదే అర్జీ వొస్తే పునః పరిశీలన పరిథిలో ఉందో లేదో నిర్ధారణ చేయాలని కలక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. కొంత సమయం వెచ్చించి వారిని సంతృప్తి చెందేలా మాట్లాడి వాస్తవ పరిస్థితిపై అవగాహనా కల్పించాలన్నారు. మండల స్థాయిలో చర్యలు తీసుకోవలసిన వాటికీ అక్కడే స్పందన ఉంటే ప్రజల్లో వ్యవస్థ పై నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు వారిని పిలిపించుకుని ఓపికగా వివరాలు తెలుసుకుంటే మనపై నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. సమస్య తెలుసుకునే ప్రయత్నం మనం చెయ్యగలిగితే తమకి తగిన న్యాయం చేకూరుతుందని అన్న విశ్వాసం పెంచేలా పనితీరు ఉంటే కలక్టర్ వద్దకు, ఇతర ఉన్నతాధికారులకు వొచ్చే అవకాశం లేదన్నారు. దిగువ స్థాయిలో పనిచేసే వారికి వారీ పరిధి మేరకు పనులను చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చెయ్యాలన్నారు. పీపుల్స్ తహసిల్దార్ లుగా రెవిన్యూ అధికారి పనితీరు ఉండాలనీ పేర్కొన్నారు. పాలసీ పరమైన అర్జీలు మాత్రమే కలెక్టర్ స్థాయిలో పరిష్కారం లభించే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలకు నమ్మకం పెంచేలా రెవిన్యూ అధికారులు తీరును మెరుగు పరుచుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇతర శాఖల అర్జీలు ప్రభుత్వ ఉత్తర్వులకు, నిర్ధిష్ట నియమాలకు కట్టుబడి ఉంటాయి, అదే రెవిన్యూ సంబంధ అంశాలపై వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం భూ సంబంధ అర్జీలు ఉంటాయని పేర్కొన్నారు. .అర్జీలు పరిష్కారం కోసం మనం ఇచ్చే సమాధానం కనిపించే రీతిలో, అర్జీ దారుడు సంతృప్తి చెందేలా ఉండాలన్నారు.
ఇకపై టూర్ డైరీ సమర్పించే క్రమములో క్షేత్ర స్థాయిలో ఎన్ని పిజిఆర్ఎస్ అర్జీలను పరిశీలన చేసినట్లు నివేదిక లో పొందుపరచాలని పేర్కొన్నారు
మండల స్థాయిలో పరిష్కారం అయ్యే సమస్యలు జిల్లా కలెక్టర్ కి రావడం పై కలెక్టర్ ప్రశ్నించారు. మండల స్థాయిలో చర్యలు తీసుకోవలసిన వాటికీ అక్కడే స్పందన ఉంటే ప్రజల్లో వ్యవస్థ పై నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. దిగువ స్థాయిలో పనిచేసే వారికి వారీ పరిధి మేరకు పనులను చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చెయ్యాలన్నారు. పీపుల్స్ తహసిల్దార్ లుగా రెవిన్యూ అధికారి పనితీరు ఉండాలనీ పేర్కొన్నారు. పాలసీ పరమైన అర్జీలు మాత్రమే కలెక్టర్ స్థాయిలో పరిష్కారం లభించే అవకాశం ఉంటుందన్నారు.
పిజి ఆర్ ఎస్ ద్వారా ఇప్పటి వరకూ 1158 రెవిన్యూ పరంగ 1158 అర్జీలు రాగా, వాటిలో 825 కలక్టరేట్ కు, 152 మండల స్థాయి కి , ముఖ్యమంత్రి కార్యాలయం కి 23, ఉప ముఖ్యమంత్రి ద్వారా 6, ఇతరములు 152 ఉన్నాయన్నారు. రెవిన్యూ శాఖ పరంగా 42 అంశాలకు సంబంధించి అర్జీలు పరిష్కారం కోసం వొస్తాయని, వాటిలో మొదటి 10
అంశాలకు సంబంధించినవి 999 ఉండగా, మిగిలిన 32 అంశాలకు సంబంధించినవి 159 మాత్రమే ఉన్నాయని తెలిపారు.
నాణ్యత తో కూడిన అర్జీలను పరిష్కారం చెయ్యకపోవడం వల్లనే అర్జీలు రీ ఓపెన్ అవుతున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు పేర్కోన్నారు. రెవిన్యూ అధికారుల సమావేశంలో రెవిన్యూ సంబంధ, ప్రజా ఫిర్యాదుల అంశాలపై చర్చించి వాటికీ నిర్ణయాత్మక మైన పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ తప్పకుండా బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సర్వీస్ కు చెందినవి 321, ఆర్ వో ఆర్ 243 , ఆక్రమణలు 121 , భూసేకరణ 75 , సెక్షన్ 22 (ఏ) 58 ఉన్నాయని తెలిపారు.
ఈ సమావేశాల్లో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, ఆర్డీవోలు ఆర్. కృష్ణ నాయక్ , రాణి సుస్మిత , కలక్టరేట్ ఏ వో ఆలీ మహమ్మద్ , తహసీల్దార్లు , ఇతర రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News