Breaking News

త్వరలో చేనేత సహకార సంఘ ఎన్నికలు

-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
-ఎన్నికల హామీల అమలుకు కట్టుబడిన ఉన్న సీఎం చంద్రబాబు
-ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించండి
-సమీక్షలో మంత్రి సవిత ఆదేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
త్వరలో చేనేత సహకార సంఘ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. దీనిలో భాగంగా నూతన సహకార సంఘాలను ఏర్పాటు చేయడంతో పాటు నిద్రాణస్థితిలో ఉన్న సంఘాలను బలోపేతం చేయాలని మంత్రి ఆదేశించారు. మంగళగిరిలోని హ్యాండ్లూమ్, టెక్స్ టైల్స్ కమిషనరేట్ లో వివిధ జిల్లాలకు చెందిన డీడీలు, ఏడీలతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, చేనేత కార్మికుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబునాయుడు ప్రణాళికలు అమలు చేస్తున్నారన్నారు. గత ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నారన్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపునకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. చేనేతలకు ప్రస్తుత ట్రెండ్ తగ్గట్లు శిక్షణ అందజేసి, తయ్యారైన వస్త్రాలకు మార్కెంట్ సదుపాయం కూడా కల్పించనున్నామన్నారు. చేనేతకు క్యాష్ లెస్ వైద్యమందించేలా బీమా సదుపాయం కల్పించనున్నామన్నారు. మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నామన్నారు. నూలుపై 15 శాతం సబ్సిడీ కూడా అందజేయనున్నాన్నారు. ఇవే కాకుండా 2014-19 మధ్య అమలు చేసిన అన్ని పథకాలనూ చేనేతలకు అందివ్వనునట్లు మంత్రి వెల్లడించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ముద్ర రుణాలపై చేనేత కార్మికులకు వ్యక్తిగత, సామూహిక రుణాలివ్వాలన్నారు. తెలియజేయాలన్నారు. ప్రస్తుతమున్న టెక్స్ టైల్స్ పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు చీరాలలో నూతన టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుచేయనున్నామన్నారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు పథకాలపై చేనేతలకు అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం అన్ని జిల్లాల్లోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

నూతన సహకార సంఘాలను ఏర్పాటు చేయండి
రాష్ట్రంలో నూతన సహకార సంఘాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత ఆదేశించారు. అదే సమయంలో నిద్రాణస్థితిలో ఉన్న సంఘాలను బలోపేతం చేయాలన్నారు. త్వరలో చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించనున్నామని, ఈ నేపథ్యంలో సంఘాలను బలోపేతం చేయాలని చేయాలని స్పష్టంచేశారు. ఇందుకోసం చేనేత, జౌళిశాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏయే జిల్లాల్లో ఎన్నెన్ని నూతన సంఘాలు ఏర్పాటు చేయబోతున్నారో మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో చేనేత కార్మికులు ఎంతమేర నష్టపోయారో నివేదికలివ్వాలని ఆయా జిల్లాల ఏడీలు, డీడీలను మంత్రి సవిత ఆదేశించారు. అనంతరం మంత్రి సవితను చేనేత, జౌళిశాఖాధికారులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, అడిషనర్ డైరెక్టర్ శ్రీకాంత్ ప్రభాకర్ , జేడీ కన్నబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *