-గత సర్కారు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టిందన్న లోకేశ్
-ఇతర మంత్రులతో చర్చిస్తున్నట్టు వెల్లడి
-త్వరలోనే రీయింబర్స్ మెంట్ సమస్యను పరిష్కరిస్తామని హామీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు తీపి కబురు అందించారు. త్వరలోనే విద్యార్థి మిత్రులు శుభవార్త వింటారని… ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయడంపై కసరత్తులు జరుగుతున్నాయని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చేయకుండా రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టిందని ఆరోపించారు. దీనిపై రాష్ట్ర మంత్రివర్గ సహచరులతోనూ, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖ అధికారులతోనూ చర్చిస్తున్నానని లోకేశ్ తెలిపారు. త్వరలోనే పెండింగ్ బకాయిల అంశాన్ని పరిష్కరిస్తామని, తాను ఎప్పుడూ విద్యార్థుల పక్షమేనని మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో వివరించారు.