-ప్రపంచ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా స్విమ్స్ హాస్పిటల్ నందు మహిళల కోసం ప్రత్యేక రాయితీతో అక్టోబర్ నెల 21వ తేది నుండి 31వ తేది వరకు “మామోగ్రామ్ పరీక్షలు”
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) నందు ఆంకాలజి, రేడియాలజి మరియు కమ్యూనిటి మెడిసిన్ విభాగాల మహిళా వైద్యుల పర్యవేక్షణలో ‘ప్రపంచ రొమ్ము క్యాన్సర్ అవగాహన” మాసంను పురస్కరించుకొని అక్టోబర్ నెల 21వ తేది నుండి 31వ తేది వరకు స్విమ్స్ క్లినిక్ నందు ప్రత్యేకించి 40 సం॥లపై బడిన మహిళల కోసం రొమ్ము క్యాన్సర్ అవగాహన క్యాంపెయిన్ ను ప్రారంభించనున్నట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డా|| రామ్ తెలియజేశారు.
సాధారణంగా అక్టోబర్ మాసాన్ని (పింక్ అక్టోబర్) ప్రపంచ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా గుర్తించారని, 40 ఏళ్ళ వయస్సు పైబడిన మహిళలు రొమ్ము లేదా అండాశయ క్యాన్సర్, వ్యక్తిగత లేదా కుటుంబ చరిత్ర వున్న మహిళలు మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలనుకునే వారు స్విమ్స్ క్లినిక్ లో సంప్రదించి రూ. 1000/- ప్రత్యేక రాయితీతో డాక్టర్ కన్సల్టేషన్ మరియు మామోగ్రామ్ పరీక్షలు నిర్వహించుకోవచ్చునని దీనిని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా॥ ఆర్.వి. కుమార్ తెలియజేశారు.
ఈ స్పెషల్ క్లినిక్ నేరుగా నమోదు చేసుకొనుటకు పేషంట్లు ఉదయం 8 గం||ల నుండి మ॥ 12 గం॥ల వరకు స్విమ్స్ క్లినిక్ నందు నమోదు చేసుకోవచ్చునని. ఇతర వివరాల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్: 8333997968
గమనిక: 27.10.2024(ఆదివారం) మరియు 31.10.2024(గురువారం) దీపావళి పండుగ సందర్బంగా ఈ రెండు రోజులు మామోగ్రామ్ పరీక్ష నిర్వహించబడదు.
Prajavartha Online Telugu News