-ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
దాచేపల్లి, పల్నాడు జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయితీ 12వార్డు అంజనాపురం కాలనీలో మంచినీటి పైపులైను పనులను పరిశీలించిన అనంతరం డయేరియా బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ డయేరియా తో ఒక్కరు కూడా చనిపోలేదని, అంజనా పురం లో ఏ ఒక్కరూ చనిపోలేదని, కేవలం కడుపులో నొప్పితో 17 మంది చేరారని, ఇతర అనారోగ్య కారణాలతో ఇద్దరు మరణించారని, మరో ఏడుగురు ఇంట్లోనే చికిత్స పొందు తున్నారని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ వెంటనే అప్రమత్తమయ్యిందని, మున్సిపల్ అడ్మిని స్ట్రేషన్ శాఖ,రెవిన్యూ శాఖ అధికారులు అంజనా పురం కాలనీలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, సహాయ సహకారాలు అందిస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. స్థానిక శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి,జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు, డి ఎం హెచ్ ఓ సి.హెచ్ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వం కంటే వైద్య శాఖలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంజనాపురం కాలనీలో 25 లక్షల రూపాయల వ్యయంతో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మిస్తారని ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక ప్రజలు మంత్రిని కొన్ని మౌలిక వసతులు కావాలని కోరడంతో అందుకు ఆయన అంగీకరించారు. త్వరలోనే పనులు ప్రారంభించి ప్రజల కోరిక నెరవేరుస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి మురళి, మండల తహశీల్దార్ కుటుంబరావు, ఎంపీడీవో పాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.