గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో త్రాగునీటి సరఫరాని అధిక ప్రాధాన్యతగా ఇంజినీరింగ్ అధికారులు తీసుకోవాలని, ఎక్కడైనా సాంకేతిక సమస్యల వలన పైప్ లైన్ ద్వారా నీటిని సరఫరా చేయలేని సమయాల్లో యుద్దప్రాతిపదికన మరమత్తులు చేపట్టి, ఆయా ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శనివారం కమిషనర్ ఎస్.వి.ఎన్.కాలనీ, హౌసింగ్ బోర్డ్, బ్రాడీపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి త్రాగునీటి సరఫరా, పారిశుధ్యం పరిశీలించి, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ ఎస్.వి.ఎన్.కాలనీలో పర్యటించి, గత కొన్ని రోజులుగా త్రాగునీటి సరఫరా సక్రమంగా జరగడంలేదన్న స్థానికుల ఫిర్యాదు మేరకు ఇంజినీరింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని, హెచ్.ఎల్.ఆర్.లో మోటార్లు మరమత్తు వలన సరఫరాలో సమస్య ఏర్పడిందని తెలియచేయగా వారి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ త్రాగునీటి సరఫరాని అధిక ప్రాధాన్యతగా పరిగణలోకి తీసుకోవాలని, నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మోటార్ మరమత్తులను యుద్దప్రాతిపదికన చేపట్టాలని, అప్పటి వరకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని ఆదేశించారు. ఎస్.వి.ఎన్.కాలనీ మెయిన్ రోడ్ ని ఎన్.క్యాప్ నిధులతో ఎండ్ టు ఎండ్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. డ్రైన్ల శుభ్రం చేయడంలేదన్న ఫిర్యాదు మేరకు ప్రజారోగ్య అధికారులు గ్యాంగ్ వర్క్ ద్వారా వెంటనే శుభ్రం చేయాలని ఆదేశించారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో పర్యటించి, కాలనీలోని యుజిడి లైన్లు పూర్తి స్థాయిలో వినియోగంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏఈని ఆదేశించారు. అలాగే కాలనీలో పలు ప్రాంతాల్లో వర్షం నీరు వెళ్లడానికి కల్వర్ట్ లు సరిగా లేక పోవడం గమనించి నూతన కల్వర్ట్ ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఏఈని, ఖాళీ స్థల యజమానులకు నోటీసులు ఇచ్చి శుభ్రం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. బ్రాడిపేటలోని మున్సిపల్ పార్క్ ని పరిశీలించి, వాకింగ్ ట్రాక్ ని పరిశీలించి, పార్క్ లో ముఖ్యమైన అభివృద్ధి పనులు జిఎంసి చేపట్టిందని, సాదారణ నిర్వహణను స్థానిక వాకర్స్ అసోసియేషన్ భాధ్యత తీసుకోవాలని సూచించారు. పార్క్ పరిసరాల్లో నిర్మాణ వ్యర్ధాలు లేకుండా పట్టణ ప్రణాళిక కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పర్యటనలో కార్పొరేటర్లు వి.శ్రీరామ్ ప్రసాద్, సుబ్బారెడ్డి, రోషన్, ఎస్.ఈ. నాగ మల్లేశ్వరరావు, ఈఈ సుందర్రామిరెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు, రామారావు, ఏసిపిలు, ఆర్.ఓ.లు, డిఈఈలు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్
-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …