Breaking News

చిరు వ్యాపారులకు పిఎం స్వానిధి రుణాల అందించడంలో జాతీయస్థాయిలో అవార్డ్ కి ఎంపికైన జిఎంసి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వ పిఎంస్వానిధి ద్వారా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 24,197 అప్లికేషన్ లకు గాను బ్యాంక్ ల ద్వారా 21,594 మంది చిరు వ్యాపారులకు రుణాలు అందించడం ద్వారా జిఎంసి తొలి స్థానంలో నిలిచిందని, చిరు వ్యాపారులకు రుణాలు అందించి అండగా నిల్చిన మెప్మా సిబ్బందికి నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  శనివారం ఒక ప్రకటన ద్వారా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పియం స్వానిధిలో పధకంలో వీధి వ్యాపారులకు బ్యాంక్ ల ద్వారా రుణాలు అందించే కార్యక్రమంలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో దేశంలోనే అధిక సంఖ్యలో రుణాలు అందించడం ద్వారా వారికి ఆర్ధికంగా అండగా నిలిచారన్నారు. తద్వారా రుణాలు అందించడంలో జాతీయ స్థాయిలో రాష్ట్రంలోని కార్పోరేషన్లలో మొదటి స్థానంలో జిఎంసి నిలిచిందని ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్థానంలో నిలిచినందుకు ఈ నెల 29న (మంగళవారం) విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే అభినందన కార్యక్రమంలో జిఎంసి అవార్డ్ ను అందుకోనున్నదని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *