Breaking News

“ఆయుర్వేద సద్వైద్య సంభాష పరిషద్ ” కార్యక్రమం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ఉన్న ప్రసిద్ధి చెందిన క్వాలిఫైడ్ ఆయుర్వేద వైద్యులు వారి ప్రాక్టీసు లోని అనుభవ ఆయుర్వేద చికిత్సల విశేషాలు ఆయుర్వేద వైద్యులు, విద్యార్థులు కి తెలుపుట ద్వారా విజ్ఞాన సముపార్జన, అభివృద్ధి కి దోహదపడుతుందన్న ఉద్దేశ్యం తో”ది ఇండియన్ మెడికల్ ప్రాక్టీషర్స్ కో-ఆపరేటివ్ ఫార్మసీ అండ్ స్టోర్స్ (ఇంపికాప్స్) ఆధ్వర్యంలో” విజయవాడ,బీసెంట్ రోడ్ లో ఉన్న ఇంపీకప్స్ పంచకర్మ హాస్పిటల్ లో ప్రతి నెల జరుగుతున్న “ఆయుర్వేద సద్వైద్య సంభాష పరిషద్ ” కార్యక్రమం మరియు 9 వ జాతీయ ఆయుర్వేద దినోత్సవo పునస్కరించుకొని జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సంస్ట డైరెక్టర్ డా వేముల భాను ప్రకాష్ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ లో ఆయుర్వేదం సామర్ధ్యం పెంచే ప్రణాళికలు తో భారత ప్రభుత్వం ఆయుర్వేదంలో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించడం మరియు ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్వేదం పరిధి విస్తరించడం జాతీయ ఆయుర్వేద దినోత్సవం ప్రపంచ ఉద్యమం గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంవత్సరం150 కంటే ఎక్కువ దేశాలు ఆయుర్వేద దినోత్సవం కోసం సన్నద్ధం అవడం,ప్రపంచ ఆరోగ్యానికి ఆయుర్వేదం యొక్క సహకారం ,ప్రజల కోసం ఆయుర్వేదం ని ప్రపంచ వ్యాప్తంగా బలమైన వ్యవస్థగా ప్రచారం చేయడం శుభ పరిణామం.రాష్ట్రంలో ఆయుర్వేద ఇండస్ట్రీ బలోపేతం పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి.ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్సరీస్ లో అవసరమైన ఆయుర్వేద మందులు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్ ను రాష్ట్రంలో ఉన్న ఎం. ఎస్. ఎం. ఇ ఆయుర్వేద ఫార్మాస్యూటికల్ వారికి టెండర్లు ద్వారా కేటాయించి ఆయుర్వేద ఇండస్ట్రీ అభివృద్ధికి ప్రభుత్వం సహకారాన్ని అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో స్నిగ్ధ ఆయుర్వేద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా. కె.ఎస్. ఆర్ గోపాలన్ కీళ్ళవాతం లో తన ప్రాక్టీస్ లోని అనుభవాలుని తెలియచేశారు. ఈ కార్యక్రమంకి సమన్వయ కర్తగా డా. పమ్మి సూర్యకుమార్ వ్యవహరించారు. డా.ఆదర్శ్, డా. ప్రియాంక, డా. జాబిల్లీ సహకారం అందించారు. ఈ సందర్భంగా డా. కె. ఎస్. ఆర్. గోపాలన్ మరియు డా. చైతన్య గార్ల ను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *