-యం.ఎల్.ఎ గద్దే రామ్మోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతిభ ప్రదర్శించి పతకాలతో తిరిగి వెళ్లాలని క్రీడాకారులకు విజయవాడ తూర్పు నియోజక వర్గ శాసన సభ్యులు గద్దే రామ్మోహన్ సూచించారు. 68 వ ఆంధ్రప్రదేశ్ అంతర జిల్లాల పాఠశాల క్రీడా సమాఖ్య అండర్ -19 బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలను కృష్ణ లంక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం నాడు ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి పోటీలను ప్రారంభించి అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన సభకు విజయవాడ డి.వి. ఇ.ఓ సి.యస్.యస్ యన్ రెడ్డి అధ్యక్షత వహించారు. గద్దే తన ప్రశంగాన్ని కొనసాగిస్తూ తల్లి దండ్రులు చదువుతో పాటు తమ పిల్లలను క్రీడలలో ప్రోత్సాహించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత నిస్తున్నట్లు తెలుపుతూ క్రీడాకారులు సద్వినియోగించుకోవాలని గద్దే తెలిపారు. క్రీడలు ఆత్మ విశ్వాసం, స్నేహ భావాన్ని పెంపోందిస్తాయని అన్నారు. తన నియోజక వర్గంలోని క్రీడా ప్రాంగాణాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.సి.యస్.యస్ యన్ రెడ్డి మాట్లాడుతూ చక్కటి వాతావరణం లో క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ ఇ. కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు తమ కళాశాల వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు. పోటీల కార్యనిర్వాహక కార్యదర్శి వి. రవి కాంత మాట్లాడుతూ క్రీడాకారుల ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పోటీలకు పరిశీలకులు గా పలాస నుండి డి. లక్ష్మణ కుమార్ కృష్ణ లంక ప్రముఖులు డి. రంగారావు హాజరైనారు.కాగా రాష్టం లోని 12 జిల్లాల నుండి 300మంది క్రీడాకారులు కోచ్, మేనేజర్లు పాల్గొన్నారు.