Breaking News

అన్నా క్యాంటీన్‌కు రూ.లక్ష విరాళం ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌కు అందచేసిన దాతలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదల ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్‌ నిర్వహణ కోసం లక్ష రూపాయల విరాళం అందచేయడం అభినందనీమయని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు. వజ్జే రవికుమార్, వజ్జే శ్రీదేవి మనువరాలు దోనేపూడి అశ్వని నూతన వస్త్రాలంకరణ వేడుక సందర్భంగా అన్నా క్యాంటీన్‌ నిర్వహణ నిధికి రూ.లక్ష చెక్కును ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌కు ఆదివారం అందచేశారు. స్థానిక 24కే ఫంక్షన్‌ హాలులో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ హజరై అశ్వనీ ని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్‌ నిర్వహణకు దాతలు ముందుకు వచ్చి సహాయం చేయడం అభినందనీయమని చెప్పారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నాం భోజనం, రాత్రి భోజనం మొత్తం కేవలం రూ.15లకే అందచేస్తారని చెప్పారు. కేవలం ఐదు రూపాయలకే ఒక పూట పేదల ఆకలిని అన్నా క్యాంటీన్లు తీరుస్తున్నాయని చెప్పారు. అలాంటి మంచి కార్యక్రమానికి దాతలు సహాయం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన ఒక్క ప్రకటనకు స్పందించి మన రాష్ట్రం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి దాతలు స్పందించి విరాళాలను అందిస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. విరాళం అందించిన దాతలను ఆయన అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *