తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆం.ప్ర రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి మరియు తిరుపతి జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 28 మరియు 29 తేదీల్లో తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28న సోమవారం మధ్యాహ్నం 01.05 గం.లకు మంత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారని, అనంతరం తిరుపతి పట్టణంలో స్థానిక కార్యక్రమాలలో పాల్గొని రాత్రి బస చేయనున్నారని, మరుసటి దినం 29 అక్టోబర్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని, అనంతరం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
Tags tirupathi
Check Also
ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ
-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …
Prajavartha Online Telugu News