-తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్
-బాణసంచా నిల్వలు, తయారీ, విక్రయాలకు అనుమతులు తప్పనిసరి
-జిల్లాలో అక్రమంగా బాణసంచా తయారీ, సరఫరా, విక్రయాలు చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు
-ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా జనసంచార స్థలాల్లో లేదా అనుమతులు లేకుండా విక్రయాలు జరిపిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం
-తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
దీపావళి పండుగ వస్తున్న నేపథ్యంలో బాణసంచా ప్రేలుళ్ళు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా అంతట దీపావళి మందు గుండు సామాగ్రి స్టోరేజ్ గోడౌన్లు మరియు అమ్మకాలు జరిగే ప్రదేశాలను జిల్లా ఎస్పీ గారి ఆదేశాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా పోలీస్ వారు. ఆకస్మిక తనిఖీలు చేసి, ప్రభుత్వ నిబంధనల ప్రకారము భద్రత చర్యలు తీసుకుంటున్నారా? లేదా అని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భముగా జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ మాట్లాడుతూ…దీపావళి మందుగుండు సామగ్రి తయారీ, నిల్వ కేంద్రాలు, దుకాణాల వద్ద తీసుకోవలసిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను నిర్దేశించిందని, దానికి అనుగుణంగా మందుగుండు సామగ్రి తయారీ, నిల్వ గోడౌన్లు, దుకాణ దారులు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అని అన్నారు.
బాణసంచా విక్రయాలు, నిల్వలు, తయారీ చేపట్టే వారు ఈ క్రింది ముఖ్య సూచనలు తప్పక పాటించాలి.
-బాణసంచా నిల్వలు, తయారీ, విక్రయాలు చేసే వారి వద్ద తప్పనిసరిగా అనుమతులు కలిగి ఉండాలి.
– బాణసంచా గోడౌన్లు, షాపులు, తయారీ కేంద్రాలు నివాస ప్రాంతాలకు నిర్దేశించిన దూరంలో ఉండాలి.
-ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నింటిని తప్పనిసరిగా పాటించాలి.
– దురదృష్టవసాత్తు అగ్ని ప్రమాదాలు సంభవిస్తే తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
– ప్రతీ దుకాణం వద్ద ఫైర్ ఎక్సటింగిశేర్స్ (అగ్నిమాపక యంత్రాలు), తగినంత పొడి ఇసుక, కావాల్సిన నీరు అందుబాటులో ఉండాలి.
– మైనర్లును బాణసంచా నిల్వ, తయారు, విక్రయాలు చేసే కేంద్రాల వద్ద పనుల్లో పెట్టుకొనరాదు.
– లైసెన్సు కలిగివ్ను విక్రయదార్లు లైసెన్సు లేని వ్యాపారులకు బాణాసంచా విక్రయించి, తద్వారా ఏదైనా ప్రమాదం సంభవిస్తే, దానికి లైసెన్సు దారులే పూర్తి బాధ్యత వహించాలన్నారు.
– అనుమతి పొందిన దుకాణదారులు అధికారులు సూచించిన సమయం వరకు మాత్రమే విక్రయాలు నిర్వహించాలి.
జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా రహస్యముగా మందు గుండు సామాగ్రి తయారు చేస్తున్నట్లు గాని, నిల్వ ఉంచినట్లు గాని, విక్రయిస్తున్నట్లు గాని సమాచారం ఉన్నచో పోలీసు వారికి వెంటనే 112 కి డయల్ చేసి సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరములు గోప్యంగా ఉంచబడునని జిల్లా ఎస్పీ అన్నారు.
Prajavartha Online Telugu News