Breaking News

విజ‌య‌వంతంగా ఆర్‌బీఐ90 క్విజ్ రాష్ట్ర‌స్థాయి పోటీలు

– రాష్ట్ర‌స్థాయి విజేత‌గా ఐఐపీఈ-విశాఖప‌ట్నం బృందం
– ఆర్‌బీఐ రీజ‌న‌ల్ డైరెక్ట‌ర్ బ‌షీర్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) స్థాపించి 90 ఏళ్లు అయిన సంద‌ర్భంగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ఆర్‌బీఐ90 జాతీయ‌స్థాయి క్విజ్ పోటీల్లో భాగంగా నిర్వ‌హించిన రాష్ట్ర‌స్థాయి పోటీలు విజ‌య‌వంతంగా ముగిసిన‌ట్లు ఆర్‌బీఐ రీజ‌న‌ల్ డైరెక్ట‌ర్ బ‌షీర్ సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. గ‌త సెప్టెంబ‌ర్ 19-21 వ‌ర‌కు ఆన్‌లైన్ ఆధారంగా జ‌రిగిన ప్రాథ‌మిక క్విజ్‌పోటీలో ఉత్త‌మ ప్ర‌తిభ‌క‌న‌బ‌రిచిన అండర్ గ్యాడ్యుయేట్ విద్యార్థుల బృందాల‌కు సోమ‌వారం విజ‌య‌వాడ‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌స్థాయి పోటీలు నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. సోమ‌వారం నోవాటెల్ హోట‌ల్‌లో నిర్వ‌హించిన ఈ పోటీల్లో 83 బృందాల‌కు చెందిన 166 మంది విద్యార్థులు పాల్గొన్న‌ట్లు వివ‌రించారు. ఈ పోటీల్లో ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎన‌ర్జీ (ఐఐపీఈ-విశాఖ‌ప‌ట్నం)కి చెందిన కృతజ్ఞ శర్మ, ఉజ్వ‌ల్ నారాయ‌ణ్ బృందం విజేత‌గా నిలిచింద‌ని.. అదే విధంగా స్పేసెస్ డిగ్రీ క‌ళాశాల ద్వితీయ స్థానంలో, ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ (క‌ర్నూలు) తృతీయ స్థానంలో నిలిచిన‌ట్లు తెలిపారు. మొద‌టిస్థానంలో నిలిచిన బృందానికి రూ. 2 ల‌క్ష‌లు, ద్వితీయ స్థానంలో నిలిచిన బృందానికి రూ. 1.5 ల‌క్ష‌లు, తృతీయ స్థానంలో నిలిచిన వారు రూ. ల‌క్ష గెలుపొంద‌గా వారికి మెగా చెక్‌లు అంద‌జేసిన‌ట్లు తెలిపారు. విజేతగా నిలిచిన బృందం జోన‌ల్ రౌండ్‌లో పోటీప‌డుతుంద‌ని.. జోన‌ల్ రౌండ్ పోటీలు ఈ ఏడాది న‌వంబ‌ర్ 21-డిసెంబ‌ర్ 4 మ‌ధ్య జ‌రుగుతాయ‌ని, అదే విధంగా జాతీయ‌స్థాయిలో ఫైన‌ల్ పోటీలు డిసెంబ‌ర్‌లో ముంబ‌యిలో జ‌ర‌గ‌నున్న‌ట్లు వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో ఆర్‌బీఐ ఎఫ్ఐడీడీ జీఎం మ‌హాన, వివిధ బ్యాంకుల ప్ర‌తినిధులు, అన్ని జిల్లాల ఎల్‌డీఎంలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *