Breaking News

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని జిఎంసికి సంబందించిన మార్కెట్లు, సైకిల్ స్టాండ్ లు, మరుగుదొడ్లు, సండ్రీస్ మార్కెట్లలో ఆశీలను నగరపాలక

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని జిఎంసికి సంబందించిన మార్కెట్లు, సైకిల్ స్టాండ్ లు, మరుగుదొడ్లు, సండ్రీస్ మార్కెట్లలో ఆశీలను నగరపాలక సిబ్బందికి మాత్రమే చెల్లించి రశీదు పొందాలని, దళారులు వసూళ్లకు వస్తే నేరుగా నగర కమిషనర్ కి కాల్ (9440268888) చేసి ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన వివిధ మార్కెట్లు, సైకిల్ స్టాండ్ లు, మరుగుదొడ్ల వద్ద నుండి ఆశీలు వసూళ్లకు గతంలో పాటదార్ల గడువు ముగిసినందున జిఎంసి సిబ్బందే వసూళ్లు చేస్తున్నారన్నారు. నగరపాలక సంస్థ ఐడి కార్డ్ తో, జిఎంసి అధీకృత రశీదు అందించే వారికే ఆశీలు ఇవ్వాలని వ్యాపారులకు తెలిపారు. జిఎంసికి సంబందంలేని దళారులు ఆశీలు వసూళ్లు చేస్తున్నారని పలువురి నుండి తమకు ఫిర్యాదులు అందాయని, అటువంటి వారిపై నేరుగా కమిషనర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేస్తే తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిఎంసికి చెందిన కొల్లి శారద హోల్ సెల్ కూరగాయల మార్కెట్, పివికె నాయుడు కూరగాయల మార్కెట్, పాల ఆసుపత్రి వద్ద కూరగాయల మార్కెట్, అరండల్ పేట 1వ లైన్ లోని పచ్చ గడ్డి మార్కెట్, సండ్రీస్ మార్కెట్ ల్లో వ్యాపారుల నుండి, పివికె నాయడు మార్కెట్ ఉత్తర, దక్షిణం వైపు ఫెన్సింగ్ లో, వెన్ లాక్ మార్కెట్ లో సైకిల్ స్టాండ్ లు, కొల్లి శారద హోల్ సెల్ కూరగాయల మార్కెట్ వద్ద, ఎన్టీఆర్ బస్టాండ్, కృష్ణా పిక్చర్ ప్యాలెస్ సెంటర్, బండ్ల బజార్ వద్ద, గాంధీ పార్క్ వద్ద, విజ్ఞాన మందిరం రోడ్ లోని, తహసీల్దార్ (వెస్ట్) కార్యాలయం వద్ద, పాల ఆసుపత్రి వద్ద, నాజ్ సెంటర్ వద్ద ఉన్న మరుగుదొడ్ల నిర్వహణ రుసుములను జిఎంసి సిబ్బందే వసూళ్లు చేస్తున్నారని, ఏ విధమైన దళారులకు ఆశీలు చెల్లించవద్దని కమిషనర్ తెలిపారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *