Breaking News

కార్మికుల కుటుంబాలకు గుంటూరు నగరపాలక సంస్థ తరుపున అండగా ఉంటామని, కార్మికులకు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కార్మికుల కుటుంబాలకు గుంటూరు నగరపాలక సంస్థ తరుపున అండగా ఉంటామని, కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందిచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నగర నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఇటీవల మరణించిన ప్రజారోగ్య విభాగ ఔట్సొర్సింగ్ కార్మికులు సిహెచ్.లోకరాజు, జె.దేవరాజు, ఏ.ముత్తు కుమార్ ల కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా చెక్ లను సోమవారం కమిషనర్  కౌన్సిల్ సమావేశ మందిరంలో అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు నగరపాలక సంస్థ అండగా ఉంటుందన్నారు. ఇటీవల ప్రజారోగ్య విభాగంలో అవుట్ సోర్సింగ్ విధానంలో సిహెచ్.లోకరాజు, జె.దేవరాజు, ఏ.ముత్తు కుమార్ ల కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా రూ.2 లక్షల చెక్ లని అందించామని తెలిపారు. అలాగే నగరపాలక సంస్థ నుండి అందాల్సిన పరిహారాలు, పి.ఎఫ్. కూడా త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని సంబందిత విభాగాధిపతులను, సూపరిండెంట్లను ఆదేశించామని తెలిపారు. కార్మికులు కూడా తమ సమస్యల పై అర్జీలు లేదా ఫిర్యాదులు తమకు అందిచవచ్చని, వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *