Breaking News

ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ, న్యూ రాజీవ్ నగర్ పాయకాపురం, విజయవాడ, సి.సి.ఆర్.ఎ.యస్. ఆయుష్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారి ఆధ్వర్యములో 28-10-2024 న 9వ ఆయుర్వేద దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సంస్థ యొక్క అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్-ఛార్జ్ డా .బి. వేంకటేశ్వర్లు అధ్యక్షతన సంస్థ నందు ఆయుర్వేదం పై అవగాహనకై ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమము ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ, న్యూ రాజీవ్ నగర్ నుండి బయలుదేరి ప్రకాష్ నగర్ నున్న పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి తిరిగి ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ, న్యూ రాజీవ్ నగర్ వరకు జరిగినది ఈ కార్యక్రమములో సంస్థ యొక్క అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్-ఛార్జ్ డా.బి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆయుర్వేదం దాని ప్రాముఖ్యత మన జీవన విధానంలో దానిని ఏ విధముగ అలవర్చుకోవాలి అని వివరముగా తెలియజేశారు. ఈ కార్యక్రమములో నున్న పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జె. కృష్ణ, పోలీస్ సిబ్బంది, సంస్థ సీనియర్ పరిశోధన అధికారి డా.ఎ.జే.వి. సాయి ప్రసాద్, ఇతర వైద్యులు, సంస్థ సిబ్బంది, ఓ .పి.డి. రోగులు మరియు రాజీవ్ గాంధీ నగర పాలక ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *