తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
9వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం మరియు ధన్వంతరి జయంతి సందర్భంగా ది మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్, సంస్కార్ ఫౌండేషన్ మరియు పార్థ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం తిరుపతిలో 9వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీ, ధన్వంతరి హోమం, లక్ష్మీ పూజ, అభిషేకం జరిగింది. కార్యక్రమంనకు ముఖ్య అతిధిగా పాల్గొన్న యం.ఎల్.సి. డా.సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆయుర్వేదంలో శాస్త్రీయ పరిశోధన, పరిశీలన ద్వారా ప్రపంచానికి ఆయుర్వేదంని పరిచయం చేయవచ్చు అన్నారు. ఈ రోజు జాతీయ ఆయుర్వేద దినోత్సవం వేడుకలు ప్రపంచంలో ని 150 దేశాలు జరుపుకోవడం హర్షణీయం. ప్రపంచంలో భారతదేశంకి గుర్తింపు తీసుకొచ్చే వ్యవస్థలలో ఆయుర్వేదం తగిన పాత్ర పోషిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇంపీకప్స్ డైరెక్టర్ డా. వేముల భానుప్రకాష్ మాట్లాడుతూ సనాతన వైద్యం అయిన ఆయుర్వేదంని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రపంచానికి పరిచయం చేయడంతో నేడు ప్రజలు ఆయుర్వేదం వైపు చూస్తున్నారు. ఆయుర్వేదంని ప్రత్యామ్నాయ వైద్యంగా కాకుండా దేశీయవైద్యంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి. అన్ని రాష్ట్రాలలో ఆయుర్వేద మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేటట్లు రాష్ట్ర ప్రభుత్వాలుకి కేంద్రం సూచించాలి అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో నేషనల్ మెడిసినల్ ప్లాంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని కోరారు.
ది మెడికల్ ప్రాక్టీషనర్స్ రాష్ట్ర అధ్యక్షుడు డా. బి.రాజేష్‌కుమార్ మాట్లాడుతూ ఆయుర్వేదంకి సంబంధించి ఉన్న చట్టాలలో సవరణలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్సరీస్‌లలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ఆయుర్వేదంని ప్రజలు ఉపయోగించుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో ఆయుర్వేద చికిత్సలు చేర్చడం ద్వారా ఆయుర్వేదంని ప్రజలు వినియోగించుకుంటారు మరియు ప్రభుత్వం పై ఆర్ధిక భారం తగ్గే అవకాశం వుందన్నారు. అసోసియేషన్ ద్వారా ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తామన్నారు.
పార్థ ఆయుర్వేద హాస్పిటల్ అధినేత డా.పార్థసారథి మాట్లాడుతూ ఆయుర్వేదం ప్రజల ఆరోగ్య రక్షణకి ఎలా ఉపయోగపడుతుందో ప్రజలకు అవగాహన కలిపించాలి. ఆధ్యాత్మిక కేంద్రం అయిన తిరుపతిలో భగవాన్ ధన్వంతరి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో నిర్మించాలని కోరారు.
కార్యక్రమ నిర్వాహకులు మరియు ఎం.ఎల్. సి ఎస్. సుబ్రహ్మణ్యం ఇంపీకప్స్ డైరెక్టర్ డా. వేముల భానుప్రకాష్‌ని ఘనంగా సన్మానించారు. ఈ ఆయుర్వేద దినోత్సవ వేడుకలకి అధిక సంఖ్యలో ఆయుర్వేద వైద్యులు, మానుఫ్యాక్చరర్స్ మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Tags tirupathi
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …