Breaking News

బాలలు సైబర్ నేరాల పట్ల అవగాహన పొంది సోషల్ మీడియా కు దూరంగా ఉండాలి

-కేసలి అప్పారావు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం లో బాలలు అందరూ సోషల్ మీడియా కు మరియు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సైబర్ నేరాల పట్ల అవగాహన పొంది ఉండాలనీ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు మరియు సభ్యులు జంగం రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ రోజు తిరుపతి లో భీమాస్ ప్యారడైజ్ హోటల్‌లో పిల్లలపై ఆన్‌లైన్ సెక్సువల్ దోపిడీ మరియు సైబర్ నేరాలు అనే అంశంపై చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ వారు రాష్ట బాలలహక్కుల కమిషన్ వారి సమన్వయంతో ఒక సదస్సు నిర్వహించారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలనీ సైబర్ నేరస్తులు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో బాలలు పై అనేక అసాంఘిక కార్యకలాపాలు కు పాల్పడుతున్న తరుణంలో వాటి గురించి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అప్పారావు తెలిపారు. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇటువంటి దురదృష్ట కరమైన సంఘటనలుపై ఉక్కు పాదం మోపుతుందని ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ ను ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం అని తెలిపారు.
ఇటీవల కాలంలో కొంతమంది బాలలు ఆన్లైన్ మోసాలు, డ్రగ్స్ రాకెట్ లో ఇరుక్కొని వాటిని సరఫరా చేస్తూ చెడు స్నేహాలు కు, దురలవాట్లుకు బానిసై తమ బంగారు భవిష్యత్తు ను నాశనం చేసుకుంటున్నారని మరియు అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారని తెలిపారు.
ఈ రోజు జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ప్రతి రోజు ఎదో ఒక చోట బాలలు పై అఘాయిత్యాలు, ఫొటోలు మార్ఫింగ్ చేసి భయపెట్టి బెదిరింపులుకు పాల్పడుతున్నాడని తెలిపారు. వీటిని పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి చేపట్టవలసిన కార్యక్రమాలు గురుంచి అందరూ చర్చించి ఒక నివేదికను రూపొందించారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు జంగం రాజేంద్ర ప్రసాద్ , సీఐఎఫ్ సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సుబ్రతకుమార్ పాండా, గౌరీ మేనేజర్ సీఐఎఫ్ కొండప్ప కో ఆర్డినేటర్ సీఐఎఫ్ యూత్ అంబాసిడర్ దేదీప్య, రాయలసీమ ప్రాంతానికి మరియు నెల్లూరు జిల్లా కు సంబంధించిన జిల్లా బాలల సంక్షేమ సమితి అధ్యక్షులు ,మిషన్ వాత్సల్య అధికారులు, మత పెద్దలు, యూత్ అంబాసడర్ లు, మరియు తిరుపతి జిల్లాకు చెందిన సైబర్ నేరాల పర్యవేక్షణ చేస్తున్న పోలీసు సిబ్బంది, స్థానిక స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *