విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచంలోను మరియు దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలతో మరియు స్కిల్ డెవలప్మెంట్ శాఖామాత్యులు నారా లోకేష్ సారధ్యంలో ఆంధ్ర రాష్ట్రంలోని 15 నుండి 59 వయస్సు మద్య గల వ్యక్తులకు సంబందించిన విధ్యా అర్హతలు, ఉద్యోగ అనుభవం మరియు వారి మేరుగైన ఉద్యోగ ఆ సక్తులను సేకరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి గా తీర్చిదిదేందుకు చేపట్టిన బృహతర స్కిల్ సెన్సెస్ సర్వే.
ఇప్పటికే గుంటూరు జిల్లా మంగళగిరి మరియు తాటికొండ నియోజక వర్గంలోని తుళ్ళూరు మండలం పరిధిలో స్కిల్ సెన్సెస్ సర్వేను పైలట్ ప్రాజెక్ట్ చేపట్టి పూర్తి చేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలో నవంబర్ 2వ వారంలో ప్రారంభం కాబోతున్న స్కిల్ సెన్సెస్ సర్వేలో భాగంగా ఈ రోజు మన ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ కలెక్టర్ ఆఫీసులో గల పింగళి వెంకయ్య హాల్ నందు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా లోని ప్రతి మండలం లోని సెక్రటేరియట్ లోని ఒక డిజిటల్ అసిస్టెంట్ మరియు ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ ఈ రోజు శిక్షణా కార్యక్రమానికి పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి డి. విక్టర్ బాబు గారు, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు గారు సర్వేచేబట్టబోయె ఎన్యుమరేటర్లకు శిక్షణా కార్యక్రమాన్ని ఎర్పాటు చేసి దిశా నిర్దేశం చేయడం జరిగింది.
నిన్న కలెక్టర్ గారు జిల్లా లో ప్రతి మండల్ కు సంబందించిన ఎంపీడీఓ (MPDO) గార్ల తో వీడియో కాన్ఫరెన్స్ లో స్కిల్ సెన్సస్ గురించి దిశా నిర్దేశం చేయడం కూడా జరిగింది.
స్కిల్ సెన్సెస్ సర్వేకు సంబందించి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లా జాయింట్ కలెక్టర్, నోడల్ ఆఫీసర్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి (APSSDC – DSDO), జిల్లా ఉపాధి కల్పన అధికారి (DEO), PD DRDA మరియు స్కిల్ సెన్సస్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లు కో ఆర్డినేటర్స్ గాను మండల పరిదిలో MPDO గారు పట్టణ ప్రాంతం మండలాల్లో మున్సిపల్ కమీషనర్ నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు.
క్షేత్రస్థాయిలో సచివాలయాన్ని యూనిట్గా తీసుకుని సదరు సచివాలయ జనవాసాలను క్లస్టర్ గా విభజించుకుని ఒక్కో క్లస్టర్కు ఒక ఎన్యుమరేటర్ను నియమించుట ద్వారా సర్వే నిర్వహించబడుతుంది. ప్రతి ఎన్యుమరేటర్కు నిర్దిష్ట కుటుంబాలను మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం సర్వే కార్యక్రమాన్ని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు (APSSDC – DSDO), నిరంతరం పర్యవేక్షిస్తారు.
జిల్లా లో యువతలోనున్న నైపుణ్యాలను గుర్తించి వారికి అవసరమైన నైపుణ్యాభివృద్ధిని అందించడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్న మానవ వనరులకు మరియు పరిశ్రమలకు కావల్సిన అర్హత కలిగిన మానవవనరులను మధ్య అంతర్యాన్ని తగ్గించే భుృహత్తర కార్యక్రమమే ఈ స్కిల్ సెన్సస్ సర్వే. ఈ సర్వే సందర్భంగా సంబందిత ప్రజల వద్దకు వచ్చే ఎన్యుమరేటర్లకు సహకరించడ౦ ద్వారా జిల్లాలోని నైపుణ్యాభివృద్ధిని కొనసాగించడంలో ప్రజలందరు సహకరించవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను.