Breaking News

కౌశల్ 2024 పోస్టర్ ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ విజ్ఞాన మండలి మరియు సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కౌశల్ 2024 రాష్ట్రస్థాయి సైన్స్ ప్రతిభాన్వేషణ పోటీల పోస్టర్ ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ వి విజయరామరాజు ఆవిష్కరించారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే 8, 9, 10 విద్యార్థులకు క్విజ్, పోస్టర్ మరియు రీల్స్ విభాగాల్లో పాఠశాల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి పాఠశాల నుండి క్విజ్ కు తరగతికి ముగ్గురు చొప్పున 9 మంది విద్యార్థులు, పోస్టరు, రీల్స్ కు తరగతికి ఇద్దరు చొప్పున ఆరుగురు విద్యార్థులు మొత్తం ఒక్కొక్క పాఠశాల నుండి 15 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనుటకు అవకాశం కలదు. పాల్గొను విద్యార్థులు నవంబర్ 15వ తేదీలోగా www.bvmap.org ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకొనవలెను. పాఠశాల స్థాయి పరీక్ష ఆన్లైన్ ద్వారా నవంబర్ 20, 21, 22 తేదీల్లోను,జిల్లా స్థాయి పరీక్ష ఆన్లైన్ ద్వారా డిసెంబర్ 6వ తేదీన, రాష్ట్రస్థాయి పరీక్ష డిసెంబర్ 30వ తేదీన నిర్వహించబడుతుంది.జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం పొందిన విద్యార్థులకు 1500,ద్వితీయ స్థానం పొందిన విద్యార్థులకు 1000 రూపాయలు చొప్పున, అదేవిధంగా రాష్ట్రస్థాయిలో ప్రధమ స్థానం పొందిన విద్యార్థులకు 5000,ద్వితీయ స్థానం పొందిన విద్యార్థులకు 3000, తృతీయ స్థానం పొందిన విద్యార్థులకు 2000 చొప్పున నగదు బహుమతి, ప్రశంసా పత్రం,జ్ఞాపిక అందజేయబడును. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో భారతీయ విజ్ఞాన మండలి ప్రతినిధులు సుమంత్ వెంకటేశ్వరరావు, పద్మావజి, విజయ రత్నబాబు, అరుణ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *