-జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
బ్రిటిష్ పాలకుల విధానాలకు వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుల్లో పటేల్ ఒకరని, వారి స్ఫూర్తి ఆదర్శనీయమని జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు కొనియాడారు. “జాతీయ ఏక్తా దివస్” పురస్కరించుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి స్థానిక కలెక్టరేట్ నందు నేటి గురువారం ఉదయం జిల్లా రెవెన్యూ అధికారి జి.నరసింహులు అధికారులు సిబ్బందితో కలిసి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ భారత దేశం ఒక్కటిగా ఉండాలని దేశంలోని సంస్థానాల ఐక్యతకు పాటుపడిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని (రాష్ట్రీయ ఏక్తా దివస్) సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజున దేశ వ్యాప్తంగా జరుపుకుంటాము అని, ఆయన స్ఫూర్తి ఆదర్శణీయమని అన్నారు.
బ్రిటిష్ పాలకుల విధానాలకు వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుల్లో పటేల్ ఒకరని కొనియాడారు. భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్దించిన తరువాత దేశంలోని సంస్థానాలన్నింటిని ఒకే తాటిపైకి తీసుకొచ్చే భాధ్యతను తీసుకుని సమర్థవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. దేశ సమగ్రత, సమైక్యతకు ఎంతగానో పాటుపడి ఉక్కు మనిషిగా పటేల్ కీర్తించబడ్డారని తెలిపారు. స్వతంత్ర భారత మొదటి ఉప ప్రధానిగా, హోం శాఖామంత్రిగా దేశానికి విశిష్ట సేవలందించిన సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా (రాష్ట్రీయ ఏక్తా దివస్) జరుపుకుంటున్నామని వివరించారు. అనంతరం అందరూ కలిసి రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని జయలక్ష్మి కలెక్టరేట్ ఏవో భారతి ఇతర అధికారులు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.