Breaking News

“No Shave November” బ్రోచర్ విడుదల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవంబర్ నెల “No Shave నవంబర్” సందర్భంగా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 31- 10 -24 ఉదయం 10 గంటలకు అశోక్ నగర్ నందు గల రూట్స్ ఫౌండేషన్ కార్యాలయం నందు “No Shave November” బ్రోచర్ విడుదల చేయడం జరిగింది. రూ ట్స్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పోలవరపు విజయభాస్కర్ మాట్లాడుతూ No Shave నవంబర్ సందర్భంగా ఈ నెలలో తమ జుట్టు, గడ్డం చేయించుకోకుండా పెంచుకొని దాని ద్వారా ఆదా అయ్యే డబ్బును క్యాన్సర్ బాధితులకు ఇవ్వడం జరుగుతుందని అలాగే . నవంబర్ నెల ప్రోస్టేట్ క్యాన్సర్ awareness month గా కూడా కాబట్టి ప్రొస్టేట్ కాన్సర్ బాదితుల్లకు సహాయం చేయడానికి కూడా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం. No. Shave నవంబర్ బ్రోచర్ని విడుదల చేశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి తమ జుట్టు గడ్డం పెంచుకొని 30.వ తేదీ జరిగే ముగింపు కార్యక్రమంలో వచ్చే డబ్బులు వెంకటేశ్వరరావు అనే లివర్ క్యాన్సర్ బాధితునికి అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ముగింపు కార్యక్రమంలో సర్టిఫికెట్ మెడల్ ఇచ్చి గౌరవిస్టామని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ క్యాన్సర్ బాధితులకు అండగా ఉండాలని పేర్కొన్నారు. రూట్స్ మెంబర్స్ శర్మ ఎలమందయ్య, చందు శ్రీనివాస్, మహాదేవ్, క్రాంతి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *