Breaking News

శాస్త్రోక్తముగా “ధనలక్ష్మి” పూజ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దీపావళి సందర్బంగా ఈరోజు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ప్రధానాలయం నందు శ్రీ అమ్మవారికి ఆలయ వైదిక సిబ్బంది “ధనలక్ష్మి” పూజ శాస్త్రోక్తముగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం నందు ఆలయ ఈవో కె ఎస్ రామరావు దంపతులు పాల్గొని శాస్త్రోక్తముగా పూజలు నిర్వహించారు. తదుపరి ప్రదోష కాలం నందు శ్రీ అమ్మవారికి సా. 06 గం. లకు ప్రతిరోజూ నిర్వహించు పంచహారతుల సేవ నిర్వహించిన అనంతరం దీపావళి సందర్బంగా ఆలయ ప్రాంగణములు మొత్తం దీపములు ప్రజ్వలన కార్యక్రమం, బాణాసంచాలు వెలిగించి, అనంతరం ఆలయ తలుపులు ‘కవాట బంధనం’ చేయబడును. తిరిగి రేపు యధావిధిగా దర్శనం ప్రారంభమగును అని ఈవో ఒక ప్రకటనలో తెలియున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సప్లమెంటరీలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పదవి తరగతి సప్లమెంటరీలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *