Breaking News

టీటీడీ ఛైర్మన్ బి.ఆర్ నాయుడుకి, పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు 

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) నూతన చైర్మన్ గా నియమితులైన టీవీ 5 అధినేత, ప్రముఖులు బొల్లినేని రాజగోపాల నాయుడు (బి.ఆర్ నాయుడు) కి, పాలక మండలి సభ్యులకు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గురువారం ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. సామాన్య రైతు కుటుంబానికి చెందిన బీఆర్ నాయుడు  తితిదే బోర్డు ఛైర్మన్ గా, టీటీడీ బోర్డుకు తిరిగి వారి హయాంలో పూర్వ వైభవం తీసుకురావాలని, భక్తులకు అత్యున్నత స్థాయిలో మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, అన్న ఎన్టీఆర్ ని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు 1984లో చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో బి.ఆర్.నాయుడు పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. సమర్థులైన వారిని టీటీడీ పాలకమండలి కార్యవర్గానికి నియమించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *