మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) నూతన చైర్మన్ గా నియమితులైన టీవీ 5 అధినేత, ప్రముఖులు బొల్లినేని రాజగోపాల నాయుడు (బి.ఆర్ నాయుడు) కి, పాలక మండలి సభ్యులకు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గురువారం ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. సామాన్య రైతు కుటుంబానికి చెందిన బీఆర్ నాయుడు తితిదే బోర్డు ఛైర్మన్ గా, టీటీడీ బోర్డుకు తిరిగి వారి హయాంలో పూర్వ వైభవం తీసుకురావాలని, భక్తులకు అత్యున్నత స్థాయిలో మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, అన్న ఎన్టీఆర్ ని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు 1984లో చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో బి.ఆర్.నాయుడు పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. సమర్థులైన వారిని టీటీడీ పాలకమండలి కార్యవర్గానికి నియమించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
Tags mylavaram
Check Also
ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం (ఏబీపీ)పై అధికారులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
-పెనుగంచిప్రోలు ఇబ్రహీంపట్నం బ్లాక్ లను టాప్ టెన్ లో నిలపండి…. -హెల్త్ ,ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ పై దృష్టి సారించండి….. -కలెక్టర్ …