మచిలీపట్నం, అక్టోబరు 31:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సాంఘిక మరియు గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యములో రాష్ట్ర వ్యాప్తముగా ఎస్.సి./ ఎస్.టి అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ విధానంలో DSC శిక్షణ ఇచ్చు నిమిత్తము అభ్యర్థుల ఎంపిక కొరకు ది. 03-11-2024వ తేదిన నిర్వహించవలసిన స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షాను ది. 10-11-2024 వ తేదిన నిర్వహించుటకు తేదిని మార్పు చేయుట జరిగినది. అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షా ఆన్ లైన్ మోడ్ లో మాత్రమే నిర్వహించబడుతుంది అని తెలియపరచటమైనది. కావున ఉచిత డిఎస్సి శిక్షణను తీసుకొనుటకు దరఖాస్తు చేసుకొనిన ఎస్.సి/ ఎస్.టి అభ్యర్థులందరూ స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షా మార్పు తేదిని గమనించగలరని తెలియపరుస్తూ మరియు ది. 10-11-2024 తేదిన ఉచిత డి.ఎస్.సి శిక్షణ ఎంపిక కొరకు రాష్ట్ర ప్రభుత్వమూ నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షకు తప్పని సరిగా హాజరు కావలసినదిగా మరియు మరింత సమాచారము తెలుసుకొనుట కొరకు జ్ఞానభూమి వెబ్ సైట్ నందు సందర్శించవలసినదిగా కృష్ణాజిల్లా, సాంఘిక సంక్షేమ శాఖ, డిప్యూటీ డైరెక్టర్ పత్రిక ప్రకటన ద్వారా తెలియపరచటమైనది.
Tags machilipatnam
Check Also
ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం (ఏబీపీ)పై అధికారులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
-పెనుగంచిప్రోలు ఇబ్రహీంపట్నం బ్లాక్ లను టాప్ టెన్ లో నిలపండి…. -హెల్త్ ,ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ పై దృష్టి సారించండి….. -కలెక్టర్ …