Breaking News

ఆర్టీసీ హవుస్ లో సర్దార్ వల్లభ భాయ్ పటేల్ జయంతి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రీయ ఏకతా దివస్ సందర్భంగా, దేశసేవలో తెగువ చూపి ఉక్కుమనిషిగా పేరు గాంచిన సర్దార్ వల్లభ భాయ్ పటేల్ జయంతి వేడుకను ఈ రోజు ఏపిఎస్ ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఆర్టీసీ హవుస్ నందు ఘనంగా నిర్వహించారు. సర్దార్ వల్లభ భాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భారతదేశ స్వాతంత్ర్యసమరంలోను స్వాతంత్ర్యానంతరం దేశసేవలో అడుగడుగునా ఆయన చూపిన తెగువ సాహసోపేతమైన నిర్ణయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఈ వేడుకలకు విచ్చేసిన ఆహూతులకు ఆహ్వానం పలుకుతూ ప్రధాన కార్యాలయం డిప్యూటీ చీఫ్ పర్సనల్ మేనజర్ (హెచ్ ఆర్ డి & డబ్ల్యూ) కుమారి సాంబ్రాజ్యం, ఉక్కుమనిషి వల్లభ భాయ్ పటేల్ గురించిన పరిచయ ప్రసంగం చేసి భారత దేశ ఐక్యత కొరకు ఆయన చేసిన ఎనలేని అమూల్యమైన సేవల విశిష్టతను వివరించారు. ఈ దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలోనూ, స్వాతంత్ర్య భారతావని మొదటి ఉప ప్రధానిగా, హోమ్ శాఖా మంత్రిగా వివిధ పరీక్షా సమయాలలో ఆయన దృఢ సంకల్పం, పట్టుదలతో వ్యవహరిస్తూ దేశసేవలో తెగువ చూపిన కారణంగానే ఉక్కుమనిషిగా పేరుగాంచారని తెలిపారు. ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు దేశ ఐక్యతను సుస్థిరంగా కాపాడేందుకు ఈనాటికీ దోహదం చేస్తున్నాయన్నారు. దేశ సమైక్యతను కాపాడడంలో తన సర్వస్వం ఒడ్డిన దేశభక్తునిగా ఆ మహానుభావుడి నుండి మనం నేర్చుకోదగిన విషయాలను తెలియచెప్పారు. స్వాతంత్ర్య సమరయోధునిగా, స్వాతంత్ర్యం అనంతరం ఉప ప్రధానిగా, హోమ్ శాఖ మంత్రిగా రాజ్యాంగ సభ సభ్యునిగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం భారత రత్న బిరుదు తో గౌరవించిందన్నారు.
రాష్ట్రీయ ఏకతా దివస్ సందర్భంగా వేడుకలకు విచ్చేసిన వారితో దేశ ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ వేడుకలకు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) రవివర్మ ముఖ్య అతిధిగా హాజరు కాగా, సి. పి.ఎం.  స్వరూపానంద రెడ్డి, డిప్యూటీ సిపిఏం (హెచ్.ఆర్.డి అండ్ వెల్ఫేర్) కుమారి డి. సాంబ్రాజ్యం, ఏ.డి (విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ) శోభామంజరి ఇంకా తదితర ఉన్నతాధికారులు, అధికారులు, సూపర్వైజర్లు, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, ఉద్యోగులు పలువురు హాజరయ్యారు. ఈ వేడుకలు సంస్థ హెచ్. ఆర్. డి అండ్ వెల్ఫేర్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *